తెలుగు ఆడియెన్స్ బాగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇది ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. అంతేకాదు ఆరేళ్ల తర్వాత తారక్ నటించిన సోలో మూవీ కూడా ఇదే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. ప్రకాష్ రాజ్, అజయ్ పాత్రలు కీలకంగా ఉండబోతన్నాయి. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర అని తెలుస్తుంది. ఫస్ట్ లుక్‌లు విడుదల చేసినప్పుడే ఆ డిఫరెంట్స్ ని పోస్టర్స్ లో వెల్లడించింది
టీమ్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 22న జరగనుంది. ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి చీఫ్ గెస్ట్ లు హాజరు కానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అనగానే చాలామందికి కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. రామ్ పోతినేని రెడ్, రామ్ చరణ్ వినయ విధేయ రామ, నితిన్ లై, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి ఎన్నో సినిమాలు
డిజాస్టర్ గా మిగిలాయి. అయితే త్రివిక్రమ్ హోం బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన కొన్ని సినిమాలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. అలా త్రివిక్రమ్ హాజర హిట్స్ సాధించిన సినిమా భీష్మ. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఏదేమైనా ఈ ఒక్క సినిమాతో చాలా సెంటిమెంట్స్ కి కొరటాల శివ చెక్ పెట్టినట్లు అవుతుంది. మరి ఈ కొరటాల శివ పై ఆ శివయ్య ఆలోచన ఎలా ఉందో సెప్టెంబర్ 27 తెలియనుంది...!!