పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుండి దిమ్మతిరిగే అప్డేట్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ గురించి నేడు మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని.. దీనికి ముందు తమ హీరో పవన్ కళ్యాణ్‌ను చిత్ర యూనిట్ కలిసినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో

 పోస్ట్ చేశారు. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది.. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ముందు ఈ సైలెన్స్ అని వారు తెలిపారు.  హరిహర వీరమల్లు షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. హరిహర వీరమల్లు సైలెన్స్ తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదని రాసుకొచ్చారు. సెప్టెంబరు 23న షూటింగ్ రీస్టార్ట్ కానుందని.. హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ స్టార్ పాల్గొంటారని తెలిపారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. మునుపెన్నడూ

 చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ స్పెషల్ లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ నుంచి ముందుగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్పలు భాగం అవుతున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దింపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: