నైట్ ఆ ఐటమ్ తినకుండా అస్సలు పడుకొని నాగార్జున.. అందుకే ఇంత అందమా..?

frame నైట్ ఆ ఐటమ్ తినకుండా అస్సలు పడుకొని నాగార్జున.. అందుకే ఇంత అందమా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో ఆరు పదుల వయసు దాటినా కూడా యంగ్ హీరోలకు పోటీ నిచ్చే అందాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఇప్పటికే 60 సంవత్సరాల వయసు వచ్చిన కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసుకొని అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. దానితో చాలా మంది నాగర్జున భోజనం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏది పడితే అది అస్సలు తినరు. ఎప్పుడు జిమ్ లోనే ఉంటూ వర్క్ ఔట్ లు చేస్తారు. ఏదో చాలీ చాలని తిండి తింటారు. అందుకే ఇంత వయసు వచ్చినా కూడా అద్భుతమైన రీతిలో అందాన్ని మైంటైన్ చేస్తూ ఉంటారు అని అపోహ పడుతూ ఉంటారు.

ఇక ఆయన ఎన్నో సందర్భాలలో మీ అందం సీక్రెట్ ఏమిటి అంటే... కడుపునిండా నోటికి నచ్చింది తినడమే అని చెప్పుకొచ్చాడు. నాకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటూ ఉంటాను. కానీ తిన్న తర్వాత మాత్రం ఎంత తిన్నానో అది కలిగించడం కోసం వర్కౌట్లు చేస్తూ ఉంటాను. అలా తిన్నదాన్ని అరిగిస్తూ ఉండడం వల్ల నేను అందంగా ఉన్నాను అని ఆయనే ఎన్ని సార్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే రోజు నైట్ నాగార్జునకు ఒక ఐటమ్ తినకుంటే అస్సలు నిద్ర పట్టదట. ఆ ఐటమ్ ఏమిటో అనుకుంటున్నారా..? అదే ఐస్క్రీమ్.

రోజు పడుకునే ముందు కనీసం ఒక్క ఐస్క్రీమ్ అయినా తినందే నాగార్జున అస్సలు నిద్రపోదట. కనీసం ఒక ఐస్ క్రీమ్ తిన్న తర్వాతే నిద్రపోతాడట. అలా నాగార్జున డైలీ ఫుడ్ లో ఐస్ క్రీమ్ కూడా ఒక భాగం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేర మూవీలోనూ , రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: