బన్నీకి దూరంగా రాజమౌళి... ఆ మిస్టేక్ చేయకుంటే ఈ కాంబోలో ఇప్పటికి బ్లాక్ బస్టర్ వచ్చేది..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు . ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఎంత గొప్ప క్రేజ్ వచ్చినా కూడా రాజమౌళి ఇతర భాష హీరోలతో సినిమాలు చేయకుండా కేవలం తెలుగు భాష హీరోలతో మాత్రమే సినిమాలను చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ వస్తున్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఆరుగురు స్టార్ హీరోల లో రాజమౌళి నలుగురు స్టార్ హీరోల తో సినిమాలు చేశాడు.

ఇక మిగిలినది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్. వీరిద్దరితో మినహాయిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ యంగ్ స్టార్ హీరోలతో రాజమౌళి సినిమాలు చేశాడు. ఇక ఒకానొక సమయంలో రాజమౌళి , పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేసినట్లు అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించినట్లు కాకపోతే ఆయన మాత్రం మరో రెండు సంవత్సరాల పాటు సినిమాలు చేసే ఉద్దేశం లేదు అని రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పినట్లు దానితో రాజమౌళి , పవన్ తో సినిమా చేయలేక పోయినట్లు ఆయనే చెప్పుకొచ్చాడు.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే బాహుబలి 2 సినిమా పూర్తి అయిన తర్వాత అజిత్ , అల్లు అర్జున్ హీరోలుగా ఓ మూవీ ని రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సల్ అయినట్లు దానితో రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ మూవీ ని రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: