ఆ పని చేసి ఉండకపోతే పవన్.. మహేష్ వల్ల ఆ నిర్మాత కెరియర్ క్లోజ్ అయ్యేదా..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో అత్యంత డేంజర్ జోన్ లో ఉండే వారు ఎవరు అంటే డిస్ట్రిబ్యూటర్స్ , నిర్మాతలు అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మొదట నిర్మాత ఓ కథను నమ్మి సినిమాను నిర్మిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సినిమా చూడకుండానే ఓ నిర్మాత నిర్మించిన సినిమాలను కొంత మంది డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేస్తూ ఉంటారు. సినిమా నిర్మించిన తర్వాత అమ్ముడు పోకపోతే నిర్మాత నష్టపోవడం , అమ్మిన తర్వాత సినిమా మంచి విజయం సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దానితో ఇండస్ట్రీలో అత్యంత డేంజర్ జోన్ లో ఉండేది ఈ ఇద్దరు వ్యక్తులే అవుతారు.

ఇకపోతే ఈ డేంజర్ జోన్ లో ఉన్న రెండు బిజినెస్ లలో కూడా ఉన్నారు ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్న మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఇకపోతే ఈయన ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఓ ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాట్లాడుతూ ...  నేను డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా రెండు రకాలుగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాను కాబట్టే ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. కేవలం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నట్లు అయితే ఇంత కాలం పాటు కెరియర్ను కొనసాగించే వాడిని కాదు. ఉదాహరణకు 2017 వ సంవత్సరం నేను పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ మూవీలను భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేశాను.

ఆ రెండు మూవీలు పెద్దగా ఆడలేదు. ఆ సినిమాల ద్వారా నాకు 25 కోట్ల నష్టం వచ్చింది. కేవలం డిస్ట్రిబ్యూటర్ గా అయితే నేను ఒకే సంవత్సరంలో 25 కోట్లు అడ్జస్ట్ చేయలేకపోయేవాడిని. అదే సంవత్సరం నేను నిర్మించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అయ్యాయి. అలా నేను నిర్మాతగా సంపాదించిన డబ్బులతో డిస్ట్రిబ్యూటర్ గా పోగొట్టుకున్న డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి. అలా ఒకదాంట్లో పోయిన డబ్బులు మరొకదాంట్లో అడ్జస్ట్ చేసుకోవడం వల్ల నేను ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగించగలుగుతున్నాను అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: