దయచేసి సహాయం చేయండి.. సోషల్ మీడియాని షేర్ చేస్తున్న రేణు దేశాయ్ పోస్ట్..!
మరి ముఖ్యంగా ఇటీవల పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ నుంచి పలు విషయాలపై రియాక్ట్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. అలాగే మెగా ఫ్యాన్స్ ఏదైనా అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తాజాగా, రేణు దేశాయ్ సాయం చేయడాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అసలు విషయంలోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రేణు దేశాయిను సాయం కోరాడు. 'మేడం మేము సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాం. గవర్నమెంట్ వాళ్లు మా గ్రామానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు.
70 ఏళ్లుగా మేము ఉంటున్న ఇళ్లను ఖాళీ చెయ్యాలంటూ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్లకి మేము వాటర్ బిల్ తో పాటు ఇంటి బిల్లు కూడా కడుతున్నాం. ఇల్లు కట్టుకోవటానికి లోన్ కూడా తీసుకున్నాము. అలాంటి సమయంలో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను ఒకేసారి ఖాళీ చేయమని చెబుతున్నారు. మీరైనా మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు సాయం చేయండి " అని పోస్ట్ చేశాడు. ఇక అది చూసిన రేణు దేశాయ్ " ఇలాంటి మెసేజ్ లు వచ్చినప్పుడు నేను హెల్ప్ లెస్ గా ఫీల్ అవుతున్నాను.