ఎన్టీఆర్ : ఆ సీన్ భయంకరంగా అనిపించింది.. 40 నిమిషాలు నరకం చూసా..!!

murali krishna
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాగా.. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాలం, తమిళం భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.ఈ నేపథ్యంలో గోవా  సన్నివేశాల్లో బీపీ పెరిగిపోయింది. ఎండ బీభత్సంగా ఉంది. చెమటలు తెగ పడుతున్నాయి. నిప్పుల వర్షం కురుస్తుందా అన్నట్లు ఉంది వాతావరణం. చచ్చిపోతానేమో అనిపించింది. అలాంటి సమయంలో నవ్వుతూ డైలాగులు చెప్పాలి. ఎప్పుడెప్పుడు సీన్‌ అయిపోతుందా అని ఎదురుచూశాను. సీన్‌ అవగానే ఏసీ రూమ్‌లోకి వెళ్లి పడుకున్నా. అలా పడుకొని ఏసీ ఆన్ చేయగానే కరెంట్‌ పోయింది. ఆ ముందు రోజే అక్కడ జనరేటర్‌ పాడైందట. రూమ్‌లో ఉండాలో.. బయటకు వెళ్లాలో అర్థంకాలేదు. 40 నిమిషాల తర్వాత కరెంట్‌ వచ్చింది. ఈలోపు షాట్‌ రెడీ అని పిలుపొచ్చింది. ఛీ అనిపించి నాపై నాకే చిరాకు వేసింది.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక విడుదల తేదీకి ఇంకా వారం రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు తారక్. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ తనకు ఒక చిన్న సినిమా చేయాలని ఉంది అని మనసులోని మాటను బయటపెట్టాడు.నాకు తక్కువ బడ్జెట్‌లో ఒక చిన్న సినిమా చేయాలని ఉంది. 40 రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ అయిపోవాలి. కథ నచ్చి అవసరమైతే ఆ సినిమాను నేను నిర్మించడానికి రెడీగా ఉన్నాను. కానీ ఎప్పటికైనా కచ్చితంగా చేసి తీరతాను అంటూ తారక్ చెప్పుకోచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: