ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన నటి భావన కిడ్నాప్, రేప్ కేసు..?

Suma Kallamadi
* కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన నటి భావన కిడ్నాప్, రేప్ కేసు
* ఆమె ధైర్యంగా పోరాడింది
* తనలాగా బాధితులైన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చింది  
( ఇండియా - ఇండియా హెరాల్డ్)
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా అని అడిగితే కచ్చితంగా ఉందని చెప్పవచ్చు. నిజానికి ఈ ఒక్క రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా కామాంధులు ఉన్నారు. మహిళలను వేధిస్తున్నారు. అలాంటి వేధింపులకు గురైన వారిలో మహాత్మా హీరోయిన్ భావన ఒకరు. కార్తీక మీనన్ అలియాస్ భావన "నమ్మాల్ (2002)" అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. 2008లో ఒంటరి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. హీరో అనే తెలుగు సినిమాలో కూడా చేసింది. 2009లో మహాత్మ సినిమాలో హీరోయిన్ గా చేసి చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన "ఏం జరుగుతుంది" పాట పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ పాటలో బాగా చాలా క్యూట్ గా కనిపించే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది. కేరళలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలాగానే కనిపిస్తుంది అందుకే ఈ ముద్దుగుమ్మకు చాలామంది తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.
అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన లైంగిక వేధింపులకు గురైంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు భద్రత లేదనే విషయం ఈమెపై జరిగిన దాడి తర్వాతనే అందరికీ తెలిసి వచ్చింది. అసలేం జరిగిందంటే 2017, ఫిబ్రవరి 17న, భావన షూటింగ్ ముగించుకుని కొచ్చికి తిరిగి వస్తుండగా, ఆమె కారును వ్యాన్ ఢీకొట్టింది. ఐదుగురు వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించి, ఆమెపై లైంగిక దాడి చేసి, ఆ నేరాన్ని చిత్రీకరించారు. మూడు గంటల తర్వాత ఆమెను కారు నుంచి బయట పడేశారు. దారుణంగా దాడి చేసి రోడ్డుమీద పడేసి వెళ్లిపోయినాక ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఒక రోజంతా ఆమె ఫిజికల్ మెంటల్ గాయాలతో బాధపడింది. మరుసటి రోజు భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆరు నెలల తరువాత, 2017, జులై 10న, నటుడు దిలీప్‌ను ఎనిమిదో నిందితుడిగా కుట్ర అభియోగంతో అరెస్టు చేశారు. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీకి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. 2018లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు, అయితే విచారణ సమయంలో చాలా మంది సాక్షులు విరోధంగా మారారు.
భావన తనను తాను "బాధితురాలు" అని లేబుల్ చేసుకోవడం ఇష్టం లేదు. కొందరు తనను నిందితురాలిగా పరిగణిస్తారని, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలని డిమాండ్ చేస్తున్నారని కూడా వాపోయింది. కోర్టులో కూడా ఆమెను క్రాస్ చెకింగ్ చేసే సమయంలో చాలా దారుణంగా ప్రశ్నలు వేశారు వాటికి ఆమె సమాధానాలు చెప్పొద్దనుకుంది కానీ తనలాగా ఎవరికి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదని మహిళల గౌరవానికి ఎవరూ బంధం కలిగించకూడదని ధైర్యంగా ముందుకు సాగింది.
ఈ కేసు కేరళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. హేమా కమిటీ కూడా ఏర్పాటయింది. ఇప్పుడు ఆ హేమ కమిటీ ద్వారా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉందో బయటికి తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే దాని తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ పై కూడా ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి ఇవన్నీ చూస్తుంటే ప్రముఖులుగా ఉంటున్న వారు కూడా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: