ఉదయ్ కిరణ్‌తో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‏హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా..?

Suma Kallamadi
సోషల్ మీడియాలో సినీ హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు, అరుదైన ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే సాయి పల్లవి, శ్రుతి హాసన్, రష్మిక, కాజల్, త్రిష, సమంత, తమన్నా, నిత్యా మీనన్ చైల్డ్ హుడ్ పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై చాలా మందిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మరో టాలీవుడ్ హీరోయిన్ టీనేజ్ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పైన ఇచ్చిన ఫొటో చూశారు కదా! అందులో కనిపిస్తున్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా..? మేం కొన్ని క్లూస్ కూడా ఇస్తున్నాం. వాటి ద్వారా ఈ బూరె బుగ్గల అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేయవచ్చు
ఈ లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. ఈ బ్యూటీ అందాలకు, ముచ్చటైన ఎక్స్‌ప్రెషన్స్‌కు అందరూ ముగ్దులయ్యారు. తొలి చిత్రంతోనే స్టార్‌డమ్ సంపాదించిన ఈ బ్యూటీ ఆపై కూడా చాలా హిట్స్ అందుకుంది. ఈ బాంబే బ్యూటీ తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. ఈ అందాల బొమ్మ సినిమాల కంటే హిందీ సీరియళ్లలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పటికీ ఈ భామ సీరియల్స్‌లో కొనసాగుతోంది.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోగాలిగారు..? ఈపాటికే మీకు ఆమె ఎవరో ఓ ఐడియా వచ్చి ఉంటుంది. అదేనండీ "నువ్వు నేను" మూవీ హీరోయిన్ హీరోయిన్ అనిత హస్సానందాని! ఇందులో హీరో ఉదయ్ కిరణ్. అనిత అతనితో కలిసి రొమాన్స్ చేసింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ తార అటు పై తెలుగులో చాలా అవకాశాలు అందుకుంది. కానీ ఆమె నటించిన తర్వాతి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో వేరే భాషా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. థ్రిల్లర్ మూవీ కుచ్ (2003) సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. 2013లో బిజినెస్ పర్సన్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న ఓ అప్‌కమింగ్ మూవీలో ఈమె ఓ కీ రోల్ పోషిస్తుంది. ఇందులో మాళవిక మనోజ్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత అనితకు తెలుగులో మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం. ఆమె రీసెంట్ లుక్స్ https://www.instagram.com/p/C_ic0RINio5/?utm_source=ig_web_copy_link ఈ లింక్‌పై నొక్కి చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: