అనసూయ హాట్ ఫోటో వైరల్.. ఆ యూట్యూబర్ నోట్లో కేక్ పెట్టి?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్లు ఉంటే మరికొంతమంది చిన్నచిన్న నటీమణులు కూడా రాణిస్తున్నారు. అయితే ఇందులో యాంకర్లు కూడా ఉన్నారు. ఈ కోవా లోకి అనసూయ భరద్వాజ్ కూడా వస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట్లో... చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ యాంకర్ గా మారింది అనసూయ భరద్వాజ్. అలాంటి అనసూయ భరద్వాజ్ గురించి... ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనసూయ భరద్వాజ్ చాలా పాపులర్ అయ్యారు.  దాదాపు పది సంవత్సరాల పాటు జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా పనిచేయడం జరిగింది యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే ఆ సమయంలోనే... జబర్దస్త్ షోలలో అనసూయ భరద్వాజ్ చేసిన డ్యాన్సులు ఇప్పటికీ అందరిని.. ఆకట్టుకుంటాయి. దాని ద్వారా అనసూయ భరద్వాజ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా పెరిగిపోయింది.
 జబర్దస్త్ యాంకర్ గా పని చేస్తూనే చిన్న చిన్న సినిమాలలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత జబర్దస్త్ గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాలే చేస్తోంది. రెండు సంవత్సరాల కిందట పుష్ప సినిమాలో నటించి అంతర్జాతీయ క్రేజీ సంపాదించుకుంది. ఇప్పుడు పుష్ప రెండవ భాగం సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించనుంది అనసూయ భరద్వాజ్.
అంతేకాదు విమానం లాంటి  సినిమాలలో... వేశ్య పాత్రలు చేసి కూడా అందరిని మెప్పించగలిగింది. యాంకర్ గా, టాలీవుడ్ నటిగా, అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అనసూయ భరద్వాజ్ రాణించగలుగుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ఓ యూట్యూబర్ కు కేక్ పెడుతూ కనిపించింది అనసూయ. నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. నిఖిల్ విజయేంద్ర బర్త్డే సందర్భంగా అనసూయ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతనికి కేక్ తినిపిస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: