ఇండస్ట్రీలో అసోసియేషన్ ఉన్నా ఆ కుటుంబాలు చెప్పిందే ఫైనల్ నిర్ణయమా.?
- ఎంతోమంది బాధితులు ఉన్నా చెప్పడానికి వణుకుతున్నారా.?
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలంటే టాలెంట్ తో పాటు శరీరాన్ని సమర్పించుకునే అలవాటు కూడా ఉంటేనే రాణించగలమనే నినాదం నడుస్తోంది. ఇలా అందరూ చేస్తారని కాదు. ఇండస్ట్రీ ని నమ్ముకుని ఏదో అవుదామని వచ్చిన కొంతమంది అమాయకులను ఆసరాగా చేసుకుని కొంతమంది సినీ ఇండస్ట్రీలోని పెద్దలు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అలా వేధింపులు ఎదుర్కొన్న వారు ఎవరికి చెప్పుకోలేక సమస్యలను వారి లోపల అనచుకొని మదన పడుతున్నారు. కేరళలోని హేమ కమిటీ ద్వారా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా చాలా నటినటులు వారు ఎదుర్కొన్న సమస్యల గురించి బయట పెడుతున్నారు. ఇదే తరుణంలో టాలీవుడ్ లో కూడా రచ్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో సమంత కూడా ఫిమేల్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని చెప్పింది. ఇలా నడుస్తున్న తరుణంలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించి ఇబ్బందులకు గురిచేసాడు అనే విషయం బయటకు రావడంతో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని మరింత బలపడింది. మరి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతోంది. మా అసోసియేషన్ సభ్యులు ఉన్నా కానీ వారు చెప్పిందే నడుస్తోందా.. వారి నిర్ణయాలను ఏ హీరో అయినా శిరసావహిస్తారా.. అసలు ఇండస్ట్రీ ఆ నాలుగైదు కుటుంబాల చేతిలో ఉందా.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
మనోళ్లు సుద్దపూసలా.?
ఎందుకో ఏమో మన టాలీవుడ్ కు మహిళా ఆర్టిస్టులు అంటే చిన్న చూపే. వారిని అదోరకంగా చూడాల్సిందే. ఎదురు తిరిగితే అడ్రస్ గల్లంతు చేసేస్తారు. ఇది ఏ ఒక్కరి గురించి చెబుతున్న విషయం కాదు. నెపోటిజం.. కాస్టిజం.. కామిజం కలగలిపిన ఇండస్ట్రీ టాలీవుడ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం జానీ మాస్టర్ త్రివిక్రమ్ పై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా రియాక్ట్ అయిన తీరు మరింత దారుణంగా అనిపిస్తుంది. మీకు ఏవైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు రండి మీడియా వద్దకు వద్దంటూ వారు కామెంట్ చేశారు. బాధితులు మీడియా వద్దకు నేరుగా వెళ్తున్నారు అంటే మా అసోసియేషన్ వారు తీసుకున్న నిర్ణయాలు ఏది న్యాయం చేసే విధంగా బాధ్యతలు కనిపించడం లేదని అర్థమవుతుంది. మా అసోసియేషన్ వద్దకు వెళ్లి ఏదైనా బాధితురాలు విషయం చెప్తే అది మళ్లీ ఇండస్ట్రీలోని ఆ బడా కుటుంబాల హీరోల వద్దకు చేరి సర్దుమణిగిపోతుందట. ఆ కుటుంబాలను కాదని మా అసోసియేషన్ వారు కూడా ఏమీ చేయలేరట. వాళ్ల కుటుంబాల నుంచి తప్పు చేసినా , ఇంకెవరు తప్పు చేసినా ఈ విషయం మాత్రం ఆ బడా హీరోలు,నిర్మాతలు, డైరెక్టర్ల వద్దకు తప్పనిసరిగా వెళుతుందట. దీంతో ఈ విషయం బయటకు రాకుండా అక్కడికక్కడే సెటిల్ చేసేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విసిగిపోయిన చాలామంది మహిళా బాధితులు చివరికి మీడియాను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్నారు. మరి ఇలా అయితే ఇండస్ట్రీకి రాబోవు రోజుల్లో కొత్తవారు రావడానికి జంకుతారు. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది అమ్మాయిలు టాలెంట్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఉండేటువంటి పరిస్థితులను చూసి రావడానికి భయపడుతున్నారట. అందుకే ఈ ఇండస్ట్రీకి ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ వచ్చి రాణిస్తూ ఉంటారు. కాబట్టి ఇండస్ట్రీలో అసోసియేషన్ వారు తీసుకునే ఏ నిర్ణయమైనా బాధితుల తరఫున ఉండాలి తప్ప ఆ విషయంలో బడా నటులు ఎంట్రీ ఇచ్చి సెటిల్ చేస్తే మాత్రం అసోసియేషన్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని కొంతమంది ఇండస్ట్రీ సీనియర్ విశ్లేషకులు అంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అసోసియేషన్ మేమున్నామని భరోసా ఇవ్వాలి.బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే వారిని ఇబ్బంది పెట్టిన వారు ఎంత పెద్ద వారైనా తప్పనిసరిగా అసోసియేషన్ వారు బయటపెట్టాలి.బాధితులకు తగిన న్యాయం జరిగేలా చేయాలి.తప్పు చేస్తే ఇక ఇండస్ట్రీలో రాణించలేరు అనే రూల్స్ ను తీసుకురావాలి.మహిళా నటీనటులను ముట్టుకోవాలంటేనే భయపడే నిబంధనలు పెడితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తగ్గుతుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.