మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ.. నాని డైరెక్టర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే?

praveen
సాదరణంగా ఇండస్ట్రీలో హీరోలు ఎంతో మంది దర్శకులతో పనిచేస్తూ ఉంటారు. కానీ కొన్ని కాంబినేషన్స్ పేరు వినిపిస్తే చాలు.. తెరమీద హిట్టు సినిమా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లో నాని శ్రీకాంత్ ఓదెలా కాంబో కూడా ఒకటిన్న విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నాని దసరా అనే మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నానిని హీరోగా పెట్టి తీసిన దసరా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ కూడా వసూలు చేసింది.

 బాక్సాఫీస్ వద్ద నాని సత్తా ఏంటో తెలిసేలా చేసి.. ఇక నాచురల్ స్టార్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి  కానీ చాలా గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ మళ్ళీ నానితోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తనకు కావాల్సినవన్నీ అడిగి తప్పించుకున్నాడు. ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్గా సంతోష్ నారాయణన్ సహా హైటెక్నీషియన్స్ ని కూడా తీసుకొచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు నానితో చేయబోయే రెండో సినిమాకి దేవిశ్రీకి సంగీత దర్శకుడు బాధ్యతలు అప్పగించబోతున్నాడట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందట. అయితే యాక్షన్ సినిమాలకు దేవిశ్రీ కొట్టుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఏరి కోరి దేవిని ఎంచుకున్నాడు అంటే.. ఏదో పెద్ద ప్లానే వేశాడు అంటూ నాని అభిమానులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.  అయితే శ్రీకాంత్ ఓదెలా మాస్ ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక దానికి దేవిశ్రీ సంగీతం యాడ్ అయ్యిందంటే మరో రంగస్థలం కావడం ఖాయం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: