జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలు ముగిసిన రోజే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా ఈ మూవీ యూనిట్ లాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఈ సినిమా 2 గంటల 57 నిమిషాలకు రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ సినిమా దాదాపు మూడు గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు రావడంతో సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉన్నట్లయితే ఏమీ కాదు. కానీ సినిమా కాస్త బోరు కొట్టించిన 3 గంటల రన్ టైమ్ ద్వారా ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది అని అనేక వార్తల కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన కొంత రన్ టైమ్ ను తగ్గించినట్లు ఈ 2 రెండు గంటల 46 నిమిషాల టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు , మిస్టర్ బచ్చన్ సినిమాలను , అలాగే కమల్ హాసన్ హీరోగా రూపొందిన భారతీయుడు 2 సినిమాలు భారీ రన్ టైం తో విడుదల అయ్యాయి. విడుదల అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాల రన్ టైమ్ లను తగ్గించారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అలాంటి ప్రమాదం లేకుండా ఉండేందుకు దేవర యూనిట్ ముందే ఈ సినిమా యొక్క రన్ టైం ను తగ్గించినట్లు తెలుస్తోంది.