బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసే దిశగా దేవర..!?

Anilkumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ మరో వారం రోజుల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఇది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు..సెప్టెంబర్ 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు ఈ ఈవెంట్‌కి సంబంధించిన ప్లేస్‌ని ఫిక్స్ చేశారు. దేవర చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని నోవోటెల్‌లో సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల నుంచి

 స్టార్ట్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు. కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.67 మిలియన్ ప్రీ సేల్స్ కలెక్ట్ చేసి రికార్డు తిరగరాసింది దేవర. ఇక టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తన సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 50,000 పైగా టికెట్స్ బుక్ అయి, రిలీజ్ కు 7 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. రిలీజ్ నాటికి 2.5 మిలియన్ కు పైగా రాబట్టి బాహుబలి – 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా.  ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్

 విలన్‌గా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే మొదటి రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర’ స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్నిటిలో వేసుకోవచ్చన్న మాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: