చిరంజీవిని ఆ డైలాగ్‌తో టార్గెట్ చేసిన కొరటాల..?
ఎన్టీఆర్, విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, కొరటాల శివ ఇంటర్వ్యూలో ఫియర్ గురించి ప్రస్తావన వచ్చింది. ఎవరి పని వారు భయభక్తులతో చేస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని కొరటాల అన్నారు. ఈ క్రమంలోనే పక్కవాడి పనిలో చేతులు పెట్టి కెలకకూడదు అనేలా కొంత కామెంట్ చేశారు. ఇది కచ్చితంగా ఆచార్య సినిమా టైములో పాత గాయాన్ని గెలికినట్టుగా ఉందన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కథను బాగా కెలికారని.. లేదంటే కొరటాల మంచి సినిమా అందించి ఉండేవారని అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఇది కొరటాల అభిమానులలో కూడా ఉంది.
ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల అభిమానులు పాత సంగతి గుర్తు చేస్తూ.. మెగాస్టార్‌ను సోషల్ మీడియాలో కామెంట్లతో టార్గెట్ చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే దేవర విషయంలో మెగా అభిమానులు, నందమూరి అభిమానులు రెండుగా చీలిపోయి సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. ఇది దేవర సినిమా కలెక్షన్లు, వసూళ్లు, ఫలితాలు, ట్రోలింగ్ మీద ప్రభావం ఉంటుందన్న భయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా కొరటాల కూడా ఆచార్య డిజాస్టర్‌కు చిరంజీవి కెలుకుడుకు కారణం అంటూ పరోక్షంగా చేసిన కామెంట్స్ ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇది దేవర సినిమా రిలీజ్‌కి ముందు వరకు ఇలాగే రగిలేలా కనిపిస్తోంది.
[2:33 pm, 21/9/2024] V Subhash: