ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్.. చిన్న సినిమా చేస్తా అంటూ..!!

murali krishna
నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.అరవింద సమేత వీర రాఘవ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.ఇదిలావుండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదనపు షోస్ వేసుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చేసాయి. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఇక విడుదల తేదీకి ఇంకా వారం రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు తారక్. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ తనకు ఒక చిన్న సినిమా చేయాలని ఉంది అని మనసులోని మాటను బయటపెట్టాడు.
నాకు తక్కువ బడ్జెట్‌లో ఒక చిన్న సినిమా చేయాలని ఉంది. 40 రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ అయిపోవాలి. కథ నచ్చి అవసరమైతే ఆ సినిమాను నేను నిర్మించడానికి రెడీగా ఉన్నాను. కానీ ఎప్పటికైనా కచ్చితంగా చేసి తీరతాను అంటూ తారక్ చెప్పుకోచ్చాడు.ఇదిలావుండగా దేవర సినిమా కథ చాలా పెద్దదని తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివరించిన సంగతి తెలిసిందే. మొత్తం కథను తెరకెక్కిస్తే తొమ్మిది గంటలు సమయం పడుతుందని.. కొంత కథతో పార్ట్ వన్ రూపొందించమంటూ వివరించారు. ఇంటిమేట్ సీన్స్ లేకున్నా రొమాంటిక్ సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయని.. ఐదు పూజ సీక్వెస్ట్ సినిమాకే హైలెట్ అంటూ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే దేవర మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ముహూర్తం దగ్గర పడుతుంది. దీనితో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ ఈవెంట్ ను సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవొటెల్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏముంటుందిలే అని లైట్ తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఈవెంట్ లో దేవర మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ ఇస్తున్నారు . అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.. దేవర రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ముందుగా విడుదల చేసిన ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో.. అభిమానులు కోసం ఈ ట్రైలర్ ను రివీల్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. కాబట్టి మూవీ రిలీజ్ కు ముందే.. ఫ్యాన్స్ కు మరోసారి మాస్ ట్రీట్ ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: