చాలా గ్యాప్ తర్వాత హీరో అవతారం ఎత్తబోతున్న ఎస్ ఎస్ థమన్!

Suma Kallamadi

సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలకే కాకుండా.. తమిళం, కన్నడ, హిందీ సినిమాలకు కూడా ఈయన సంగీతాన్ని అందించారు. ఈయన సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే నేటికి తమన్ సంగీత పరంపరను ఎవరు ఆపలేకపోతున్నారు. ఒక్కగానొక్క క్షణంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కంటిమీద కునుకు లేకుండా సినిమాలు చేసేవాడు. కట్ చేస్తే, థమన్ ఎంట్రీ ఇచ్చి... దేవి శ్రీ ప్రసాద్ కి విశ్రాంతి కల్పించాడు. అవును, థమన్ దాటికి దేవిశ్రీ వేరే సినిమా పరిశ్రమలను చూసుకున్నాడు. అంతలాగా ప్రస్తుతం థమన్ మానియా కొనసాగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం... ఎస్ ఎస్ థమన్ త్వరలో హీరో అవతారం ఎత్తబోతున్నట్టు విశ్వసనీ వర్గాల సమాచారం. ఒక తమిళ చిత్రం ద్వారా థమన్ హీరోగా పరిచయం కాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.
ఇక ఆ విషయం పక్కన పెడితే... థమన్ బహుశా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌కు రాకపోవచ్చు అని సంగీత ప్రియులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సంగీత ప్రేక్షకులను ఇండియన్ ఐడల్ తెలుగు వేదికపై జడ్జి స్థానంలో అలరించిన సంగీత దర్శకుడు ఇకపై రాడేమోనని వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఈ సంగీత దర్శకుడు ప్రముఖ సినిమా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో బాయ్స్ అనే సినిమాలో ఓ పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఓ సైడ్ రోల్ పోషించాడు... కానీ, ఎస్ ఎస్ తమన్ ప్రస్తుతం ఓ సినిమాకు పూర్తి నిడివి గల పాత్రకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: