క్యాస్టింగ్ కౌచ్ పై.. హీరోయిన్ ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు..!

Divya
గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లే వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఒక నివేదికను జస్టిస్ హేమ బయట పెట్టడం జరిగింది. అప్పటినుంచి చాలామంది హీరోయిన్లు ఈ నీవేదిక పైన తమ అభిప్రాయం గురించి తెలియజేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ కూడా స్పందించడం జరిగింది.

ఐశ్వర్య రాజేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి అయినది. కానీ ఇప్పటివరకు తనకు ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ కూడా ఎదురు కాలేదని.. కానీ మహిళల పైన వేధింపులకు పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే దోషులకు సరైన శిక్ష పడాలి అంటూ తెలియజేసింది. సినీ పరిశ్రమలో ఉండే మహిళలకు తాను ఇచ్చే సలహా ఇదేనా అంటూ మీరు ధైర్యంగా ఉండండి మీతో ఎవరైనా సరే మిస్ బిహేవియర్ చేయాలని చూసినా వెంటనే వారి మీద రియాక్ట్ అవ్వండి.. గట్టిగా మీ గొంతుని వినిపించండి అంటూ తెలియజేసింది ఐశ్వర్య రాజేష్.

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలరు. ముఖ్యంగా ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలులోని నటించి సుమారుగా ఇప్పటికే  50 సినిమాలకు పైగా అతి తక్కువ సమయంలోనే చేరిపోయింది. ఎక్కువగా తమిళ్ మలయాళం వంటి చిత్రాలలోనే కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉంటుంది. రాంబంటు అనే చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా 1995లోనే తన కెరీర్ ని మొదలు పెట్టింది.. 2018లో కౌసల్య కృష్ణమూర్తి అనే తెలుగు సినిమా ద్వారా మొదటిసారి తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: