వామ్మో.. రూ.100 కోట్లు వసూళ్లు సాధించేందుకు.. ఆ సినిమాకు 20 ఏళ్లు పట్టిందిగా?

praveen
ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. ఏకంగా తమ అభిమాన హీరోలకు సంబంధించిన భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేయడం చూస్తూ ఉంటాం  అయితే ఇక ఈ మధ్యకాలంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

 అయితే స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడు కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు ఇక ఆ సినిమాకు వసూళ్లు ఏ రేంజ్ లో వస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవల కాలంలో అయితే అటు స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ సాధించడం అనేది కామన్ గా మారిపోయింది. పాజిటివ్ టాక్ వస్తే చాలు రెండు మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ అందుకుంటున్నాయి సినిమాలు. కొంతమంది హీరోలు అయితే ఒకేరోజు ఏకంగా 200 కోట్ల వరకు వస్తువులు సాధిస్తూ ఉండండి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో సినిమా మాత్రం ఏకంగా విడుదలైన 20 ఏళ్ల తర్వాత 100 కోట్ల మార్క్ అందుకుంది.

 అదేంటి ఒక వారమో లేదంటే రెండు వారాలు లేదంటే ఒక నెల ఇలా సినిమా పూర్తి రన్ పూర్తయ్యేసరికి 100 కోట్లు అందుకోవడం చూశాము. కానీ విడుదలైన 20 ఏళ్ల తర్వాత 100 కోట్లు సాధించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోయిన్ ప్రీతి జింటా జంటగా నటించిన వీర్ జార సినిమా విషయంలో ఇదే జరిగింది. 2004లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 97 కోట్లు సాధించింది. ఆ తర్వాత నుంచి పలుమార్లు రీ రిలీజ్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది  కూడా 282 థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి జనాధారణను సొంతం చేసుకుంది. దీంతో 20 ఏళ్ల తర్వాత 100 కోట్ల వస్తువుల మార్కును అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: