సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండేవాడు. అది ఆయనకు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్త మైనస్ గా కూడా మారింది. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలో రాజమౌళి కూడా ఇతనెంటి ఇలా ఉన్నాడు. నా సినిమాలో హీరో అంటే అద్భుతంగా ఉండాలి అనుకున్నాను. ఇతను చూస్తే ఇలా ఉన్నాడు. ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ ఆ తర్వాత కుంటి గుర్రంతోనే కదా ఆట నెగ్గితే మజా ఉండేది అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆయన నటన చూసి షాక్ అయ్యాను అని చెప్పాడు.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి అదిరిపోయే సూపర్ సాలిడ్ మాస్ విజయం దక్కింది ఆది మూవీ తో. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఆది సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. వినాయక్ "ఆది" మూవీ గురించి మాట్లాడుతూ ... ఆ సినిమా కథ మొత్తం రాసుకున్న తర్వాత దానిని ఎన్టీఆర్ తో చేయాలి అని అనుకుంటున్నాట్లు కొంత మంది తో చెప్పాను. దానితో వారంతా అతను చాలా చిన్న పిల్లవాడు. అతనితో ఇంత పవర్ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వర్కౌట్ కాదు. అతను అంత సాలిడ్ పాత్రను మ్యానేజ్ చేయలేడు. ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోదు అని చాలా మంది అన్నారు.
కానీ నేను మాత్రం ఎన్టీఆర్ ను ఎంతగానో నమ్మాను. అతను కచ్చితంగా ఆ పాత్రను అద్భుతంగా హ్యాండిల్ చేయగలడు అనుకున్నాను. ఇక సినిమాను మొదలు పెట్టాను. మొదలయ్యాక అతను యాక్టింగ్ తో అద్భుతమైన స్థాయికి ఆ సినిమాను తీసుకువెళ్లాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యింది. అలా ఎన్టీఆర్ తో ఆ సినిమా వర్కౌట్ కాదన్నా వారంతా అతని నటనకు షాక్ అయ్యారు అని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.