యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో దేవర మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ సినిమా చుట్టూ కొంత శాతం నెగెటివిటీ నెలకొనే ఉంది. దానికి ప్రధాన కారణం కొరటాల శివ "దేవర" మూవీ కంటే ముందు ఆచార్య మూవీని తెరకెక్కించడం. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఆయన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ దేవర కావడంతో అంత పెద్ద సినిమాను ఆయన హ్యాండిల్ చేయగలడా..? అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన చాలా రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకొని ఈ మూవీని స్టార్ట్ చేయడంతో కొరటాల చాలా కాన్ఫిడెన్స్ గా స్టోరీని రెడీ చేసుకున్న తర్వాతే రంగంలోకి దిగాడు.
కచ్చితంగా అవుట్ ఫుట్ అద్భుతంగా ఇస్తాడు అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేక్షకులు కూడా భావించారు. ఈ మూవీని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇది ఆచార్య సినిమాకు దగ్గరగా ఉంది అనే టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. కానీ ఆ తర్వాత ప్రచారాలను పెద్ద ఎత్తున చేసి ఆ నెగెటివిటీని కాస్త తగ్గించారు. ఇక ఈ సినిమా యొక్క ట్రైలర్ కు నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఈ రోజు రెండవ ట్రైలర్ను కూడా విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లో సరికొత్త కంటెంట్ ఉండే ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాతే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు ఈ మూవీ దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇక భారీ రన్ టైమ్ ఎక్కడ పెద్ద దెబ్బ కొడుతుందో అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం వారు చాలా కష్టపడి ఈ మూవీలోని అనవసరపు సన్నివేశాలను తీసేసి దాదాపు 12 నిమిషాల వరకు ఈ మూవీని ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీపై నెగెటివిటీ ఏర్పడిన కారణంగానే దేవర యూనిట్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాని జనాల ముందుకు ప్రాపర్ గా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.