సింగర్ సుచిత్ర: ఆ డైరెక్టర్ కామానికి ఫామ్ హౌస్ లో ఎంతో మంది హీరోయిన్లు బలి..?

Pandrala Sravanthi
సింగర్ సుచిత్ర అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.ఎందుకంటే ఆమె సూచీ లీక్స్ తో సృష్టించిన దుమారం అంతా అంతా కాదు.ఎంతో మంది టాప్ సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలు అన్ని బయటపెట్టి వారి పరువుకు భంగం కలిగించింది. అది చాలదన్నట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ద పెద్ద సెలబ్రిటీలను టార్గెట్ గా చేస్తూ వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా లో హైలెట్ అయ్యేలా మాట్లాడింది. అంతే కాదు పెద్దపెద్ద హీరోల అభిమానులు ఈమె మాట్లాడే మాటలను ఖండించడంతోపాటు మండిపడ్డారు. దొరికితే కొట్టాలి అన్నంత కోపంతో రగిలిపోయారు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా నాకేంటి అన్నట్లు సింగర్ సుచిత్ర ఆమె చేసే పని ఆమె చేసుకుంటూనే పోతుంది. అయితే తాజాగా ఒక దివంగత లెజెండరీ డైరెక్టర్ మీద సుచిత్ర చేసిన కామెంట్స్ మీడియాలో దుమారం సృష్టించాయి. 

సింగర్ సుచిత్ర ఎంతోమంది నటులను స్టార్స్ గా చేసిన డైరెక్టర్ బాలచందర్ గారిని టార్గెట్ గా చేసి ఆమె మాట్లాడిన మాటలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలచందర్ గారు అమ్మాయిలు అంటేనే ఒక రకమైన కామంతో చూసేవారు. ఆయన ఎవరిని టచ్ చేసినా కూడా అసభ్యంగానే ముట్టుకునేవారు. అంతే కాదు ఎంతో మంది హీరోయిన్లను తన ఫామ్ హౌస్ కి రమ్మని వారితో కోరికలు తీర్చుకున్నారు  ఈయన కామపిశాచి.. ఆయన ఫామ్ హౌస్ లో ఎంతోమంది హీరోయిన్ల జీవితాలు బలయ్యాయి. ఓ రోజు నన్ను కూడా ఫామ్ హౌస్ కి ఆహ్వానించారు. కానీ ఆయన గుణం తెలుసు నేను ఆయనకు దూరంగా ఉన్నాను.

డైరెక్టర్ బాలచందర్ చచ్చిపోయే వరకు కూడా ఇండస్ట్రీ లో లస్టీ మ్యాన్ గానే ఉన్నారు.ఆయన ఏ రోజు కూడా అమ్మాయిలను చెడు దృష్టితో చూడకుండా ఉండలేదు.ఆయన హీరోయిన్లను చూసే దృష్టి కామంతోనే ఉండేది అంటూ లెజెండరీ డైరెక్టర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సింగర్ సుచిత్ర. ఇక సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ విని ఎంతోమంది బాలచందర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక బాలచందర్ ఇండస్ట్రీకి మమ్ముట్టి,చిరంజీవి,కమల్ హాసన్, రజినీకాంత్ వంటి ఎంతోమంది హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలుగా మార్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: