మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌లో స‌డెన్‌గా ఈ ఛేంజ్ ఏంటి... చిక్కిపోయిందే..?

Suma Kallamadi
మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ మొన్నటిదాకా కొంచెం బొద్దుగా చాలా అందంగా కనిపించింది కానీ ఇప్పుడు మాత్రం ఈ చక్కనమ్మ చిక్కిపోయి దర్శనం ఇచ్చింది. న‌మ్ర‌త‌లో స‌డెన్‌గా ఈ ఛేంజ్ చూసి ఘట్టమనేని ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇలా చిక్కిపోయారంటే మేడం అని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న జరిగాయి. ఈ కార్యక్రమంలో నమ్రత అటెండ్ అయింది. ఆమె పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అందులో ఆమె చాలా సన్నగా కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. 52 ఏళ్ల వయసు వచ్చినా చందమామ లాంటి గుండ్రటి ముఖంతో ఎప్పుడూ కలకలా మెరిసిపోతూ కనిపించే నమ్రత లేటెస్ట్ ఫోటోల్లో మాత్రం చాలా చాలా డల్‌గా కనిపించారు. ఇకపోతే గల్లా అశోకు నెక్స్ట్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది ఇది ఆ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న 27వ మూవీ. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ బ్యానర్ కింద భారీ సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న యువ హీరోల సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నమ్రత ఈ మూవీకి ఫస్ట్ క్లాప్ కొట్టింది. పద్మ గల్లా, మంజుల స్వరూప్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ కావాలని అక్కడికి విచ్చేసిన గెస్ట్స్‌ ఆకాంక్షించారు. ఇందులో గల్లా అశోక్‌తో గౌరీ ప్రియ రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాత్మిక కూడా మరో జంటగా నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ఉద్భవ్ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ యూఎస్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా వస్తుందని అదే సమయంలో హార్ట్ టచ్ చేస్తుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాకు భరద్వాజ్ కెమెరా మెన్. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ ఓనర్ సాయి సౌజన్య కూడా ఈ మూవీ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: