బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కల్కి 2898 ఏడి రెండో భాగం గురించి అప్పుడే ఎదురు చూపులు మొదలైపోయాయి. తాజాగా నిర్మాత అశ్వినిదత్ ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశామని చెప్పడం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దీంతోనే చూడొచ్చని ఆశ త్వరగా పడింది.అయితే ఇక్కడ చాలా ట్విస్టులున్నాయి. చాలా కీలకమైన భాగం ఇంకా షూట్ చేయలేదు. ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ తాలూకు ఎపిసోడ్స్ చిత్రీకరణ చేయాల్సి ఉంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారం అంత సులభంగా తేలదు. కల్కి మొదటి భాగానికి అక్షరాలా నాలుగు సంవత్సరాలు పట్టింది.దత్తు గారు చెప్పిన ప్రకారమే కల్కి 2 పూర్తి చేయడానికి ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత ఇంకో సంవత్సరం వీఫెక్స్ గట్రా ఉంటాయి. మధ్యలో ప్రభాస్ ఇతర కమిట్ మెంట్లను ఫినిష్ చేసుకోవాలి. వీటి సంగతెలా ఉన్నా కల్కి 2కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలైపోయాయని ఇన్ సైడ్ టాక్.టైటిల్ కూడా మారుతుందని అంటున్నారు. ‘కర్ణ 3102 బిసి’ పేరుతో కథను కర్ణుడు ప్రభాస్, అశ్వద్ధామ అమితాబ్ బచ్చన్ మధ్య నడిచేలా, మధ్యలో విలన్ యాస్కిన్ ని మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏడి నుంచి బిసికి వెళ్తుంది.అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి అన్న మాట. కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ తో పాటు మహాభారత యుద్ధం తర్వాత అసలేం జరిగిందనే అంశాలు మరింత డీటెయిల్ గా చూడొచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2028లో విడుదల చేసేలా ప్లానింగ్ చేశారని అంటున్నారు.
ఇది నిజమని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు కానీ లీక్స్ అయితే బలమైన సోర్స్ నుంచే వచ్చాయి. ఒకవేళ గాసిప్ అయినా ఆశ్చర్యం లేదు కానీ ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద ఇంత ఎగ్జైట్ మెంట్ కలగడం కల్కికే జరిగిందని చెప్పొచ్చు.పైగా పర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడే నాగ్ అశ్విన్ ఫస్ట్ పార్ట్ కు వచ్చిన స్పందనను చాలా స్పష్టంగా గమనిస్తున్నాడు.వసూళ్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి కానీ కంటెంట్ పరంగా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని ఇంకా బాగా తీయాలంటే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా డీల్ చేస్తుంది. సో ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయి ప్రభాస్ ఇతర సినిమాల మీద దృష్టి పెట్టాలి. అప్పటిదాకా కల్కికి చిన్న బ్రేక్ తప్పదు.ఈనేపథ్యంలో ముందు మారుతీ ది రాజా సాబ్ ఉంది. అటుపై దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉన్నాడు.యానిమల్ తో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ఏదో ఒక రోజు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంకు వెళదాం రా అంటాడు. వీటి మధ్యలో కల్కి 2 కోసం ప్రభాస్ డేట్లు సర్దాల్సి ఉంటుంది. ఇదంత ఈజీ కాదు.