వామ్మో: నటి సత్య కూతురును చూశారా.. స్టార్ హీరోయిన్స్ ని మించిపోయిందిగా..!

Anilkumar
సత్య కృష్ణ పేరు గత ఇరవై ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీలో రానిస్తుంది. దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్య కృష్ణన్.. హీరోయిన్‌గానే కాకుండా.. వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆనంద్, బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ.. ఇలా చాలా సినిమాల్లో నటించింది సత్య. ఆమె నటనతో పాటు.. ఆమె హస్కీ వాయిస్‌కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలతో తప్ప బయట పెద్దగా కనిపించదు. కొన్నేళ్ల క్రితం వరకు ఆమెకు సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవని తెలుస్తున్నాయి. ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా

 షేర్ చేస్తూ వస్తుంది. దగ్గర దగ్గర  70 సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది. అందం, అభినయంతో మంచి వేషాలు అందుకుంది. హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఆమె ఎందుకో ఏమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయింది. కాగా సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ ఫోటోలు నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ అమ్మ అందమే వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే సూపర్ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. అయితే అనన్య ఇప్పటికే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాలో ఓ కీ రోల్ చేసింది.  “ఊ అంటావా మామ ఉఊ అంటావా మావ” అనే సినిమాలో మంచి పాత్ర చేసింది.

మరి సత్య  కూతురు తనలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోతుందా లేదా హీరోయిన్గా చలామణి అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న సత్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ కి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: