పవన్, ప్రభాస్ కి షాక్ ఇచ్చిన బన్నీ.. సక్సెస్ రేట్ లో వారిదే మొదటి స్థానం..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోస్ చాలామంది ఉన్నారు. అయితే అందులో ప్రస్తుతం ఏ హీరోలకి అత్యధిక సక్సెస్ రేట్ ఉంది? ఎవరు ముందు వరుసలో ఉన్నారు? ఎవరు ఆఖరిలో ఉన్నరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. అలాగే ఇందులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ బన్నీ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ స్థానం ఎక్కడ ఉన్నది అన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక హీరో నాలుగైదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటైనా కచ్చితంగా హిట్ అవుతుంది. అలా ఒక సినిమా హిట్ అయిన వెంటనే వాళ్లు వేరొక పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసి స్టార్ హీరోగా చలామణి అవుతారు. అందులో ఉన్నవారే ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోస్. కానీ కుర్ర హీరోలకి మాత్రం అలా కాదు వాళ్లకి

 ప్రతి ఒక్క సినిమా కూడా ఒక యుద్ధమే అని చెప్పాలి. చిన్న హీరోలు చేసిన సినిమాలు పుసుక్కున ఫెయిల్ అయితే గనుక వాళ్ళ పరిస్థితి దారుణమని చెప్పాలి. కాసేపు చిన్న హీరోల విషయం పక్కన పెడితే..  టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోస్ చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్. ఇక ఈ సీనియర్ హీరోల విషయం పక్కన పెడితే.. సూపర్ స్టార్ హీరోస్గా రాణిస్తున్న వారిలో ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్  ముందు వరుసలో ఉంటారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సక్సెస్ రేట్ విషయంలో మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే

 దాదాపుగా బన్నీ 20 సినిమాలకు పైగా చేశాడు. ఇక అందులో 14 సినిమాల వరకు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలా బన్నీ సక్సెస్ రేట్  70 శాతానికి వచ్చింది. అయితే ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నీ సైతం వెనక్కి నెట్టేసాడు అల్లు అర్జున్. అయితే మొదట్లో అల్లు అర్జున్ ఉంటే చివరిలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక ఆయన కెరియర్ లో ఇప్పటికే 28 సినిమాలు చేసిన ఆయన దాదాపుగా 11 సినిమాలు తో మాత్రమే సక్సెస్ అయ్యారు. అలా పవన్ సక్సెస్ రేట్  70% గా ఉంది. ఇలా టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోస్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: