శత్రు సైన్యానికి ఒకే ఒక యోధుడు.. దేవర అభయం ఇవ్వరా..!

Suma Kallamadi

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర: పార్ట్ 1' సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 ట్రైలర్లు విడుదలయ్యాయి. ఈ రెండు ట్రైలర్లలోనూ సినిమా మెయిన్ స్టోరీ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా పడ్డారు మేకర్స్. జూ.ఎన్టీఆర్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లోనూ నటిస్తున్నాడు. తండ్రి పాత్ర పేరు దేవర. కొడుకు పాత్ర పేరు వర. తండ్రి శత్రు సైన్యానికి భయం పుట్టిస్తుంటాడు ఒకే ఒక యోధుడి లాగా వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంటాడు.
కొడుకు వర చాలా పిరికోడి లాగా ఉంటాడు. తన తండ్రి తనను వదిలి వెళ్లిపోయినట్లు కొడుకు భావిస్తాడు. కానీ కథ ముగిసేసరికి కొడుకు తండ్రిలాగే మారవలసి ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ "భైర" అనే కుస్తీ కళాకారుడి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఒక తీరప్రాంత గ్రామానికి చెందినవాడు. ఆ గ్రామంలోని అందరూ దొంగలు. వారు ఓడలను దోచుకుంటారు, పోస్ట్ గార్డులను  చంపుతారు, అల్లర్లు చేస్తారు. భయం అనేదే వీళ్లకి తెలియదు. కానీ, "దేవర" వల్ల వీళ్లకి భయం అనేది ఏంటో తెలుస్తుంది. వీరందరికీ భయం ఏంటో తెలియజేసే పోస్ట్ గార్డులు అందరికీ అభయం ఇస్తాడు దేవర.
ట్రైలర్ లో భైర దేవరతో స్నేహం చేసి, తర్వాత అతనికి వెన్నుపోటు పొడుస్తాడని తెలుస్తోంది.ఎందుకంటే భైరకి ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ. అందుకే దేవరని పదవి నుంచి తొలగించి, తాను దొంగతనం చేస్తూనే ఉండాలని ప్లాన్ చేస్తాడు.
లేటెస్ట్ ట్రైలర్‌లో జూ.ఎన్టీఆర్ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించాడు. తీర ప్రాంతంలో జరిగిన మర్డర్స్ కూడా ఈ ట్రైలర్ లో కనిపించాయి. సెకండ్ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సముద్రం ఎర్రగా మారిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఒక తీరప్రాంతంలో జరుగుతుంది. అక్కడి ప్రజలు చాలా కష్టాలు పడుతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రజలను కాపాడేందుకు వస్తాడు. చెడు వారికి ఆయన భయంకరమైన శత్రువుగా నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: