తారక్ : దేవర ఈవెంట్ రద్దుపై ఎమోషనల్.. ఆ విషయంలో మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు అనగా సెప్టెంబర్ 22 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్లు ఓ వార్త కూడా వైరల్ అయింది. అదంతా పక్కన పెడితే సినీ ప్రముఖులు వస్తారో రారో కానీ తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ ఎలాగో ఈ ఈవెంట్ కి వస్తాడు. ఆయన తన స్పీచ్ తో అదరగొడతాడు అని ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. 

అలాగే సామాన్య సినీ ప్రేమికులు కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏమి మాట్లాడతాడు. ఈ మూవీ యూనిట్ అంతా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి విషయాలను చెబుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక సమయం వచ్చింది కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఇక చివరగా ఈ మూవీ ప్రీ రిలీజ్ క్యాన్సల్ అయింది. దానితో ఎన్టీఆర్ అభిమానులు , మామూలు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. దానితో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. అందులో తారక్ మాట్లాడుతూ... దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎంతో బాధగా ఉంది. ఏ కాస్త అవకాశం దొరికిన మీ అందరితో గడపాలని , దేవర సినిమా గురించి చెప్పాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చాను. కానీ భద్రత కారణాల వల్ల ఈ రోజు జరగవలసిన ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు మీరు ఎంత బాధ పడుతున్నారో అంతకు ఎక్కువ నేను బాధపడుతున్నాను. ఇక ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు సినిమా నిర్మాణ సంస్థను గాని , ఈవెంట్ ఆర్గనైజర్ ను తప్పు పట్టడం సరైన విషయం కాదు. ఈ రోజు మనం కలుసుకోకపోవచ్చు. కానీ సెప్టెంబర్ 27 వ తేదీన మాత్రం కలుస్తాం. 

ఆ రోజు మీరంతా కాలర్ ఎగరేస్తారు అనే నమ్మకంతో నేను ఉన్నానన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ ఆశీర్వాదం కచ్చితంగా దేవర సినిమాకు , అలాగే యూనిట్ మొత్తం కి ఎంతో అవసరం అని తెలియజేస్తూ ఆఖరుగా మీరంతా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇంత జరిగినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను , ఈవెంట్ ఆర్గనైజర్ ను ఏమీ అనకండి అనడంతో ఆయన అభిమానులు ఎన్టీఆర్ వ్యక్తిత్వం సూపర్ అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: