పారితోషికం విషయంలో జై బాలయ్య అనాల్సిందే.. నిర్మాతల హీరో అంటే బాలయ్యే గుర్తొస్తారుగా!
కెరీర్ తొలినాళ్లలో బాలయ్య సొంత బ్యానర్ సినిమాలలోనే ఎక్కువగా నటించడం జరిగింది. అందువల్ల బాలయ్య పారితోషికం పెద్దగా తీసుకోకుండానే నటించిన సందర్భాలు ఉన్నాయి. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ సినిమాల రిలీజ్ సమయంలో బాలయ్య పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండేది. తర్వాత రోజుల్లో వరుస ఫ్లాపుల ప్రభావం బాలయ్య కెరీర్ పై ఎఫెక్ట్ చూపించింది.
సింహా సినిమా రిలీజ్ సమయంలో బాలయ్య 7 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. లెజెండ్ సినిమా సమయంలో 8 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్న బాలయ్య అఖండ సినిమాకు మొదట 10 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నా తర్వాత రోజుల్లో బాలయ్యకు బాగానే లాభాలు దక్కాయి. ప్రస్తుతం బాలయ్య పారితోషికం 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
మాస్ ప్రేక్షకుల్లో బాలయ్యకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సంక్రాంతికి షెడ్యూల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య మరోసారి మాస్ సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కింగ్ అనిపించుకుంటాడని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. సినిమా ఫ్లాపైతే రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చే హీరోగా కూడా స్టార్ హీరో బాలయ్య పేరుంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.