దేవర: ఎన్టీఆర్ పై ప్రేమతో జాన్వీ అలాంటి పని.. కాని నిరాశే..?

Divya
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మొట్టమొదటిసారిగా నటిస్తున్న  పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాని కొరటాల శివ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా  సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర బృంద నిన్నటి రోజున గ్రాండ్గా హైదరాబాదులో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు..అయితే అక్కడ అభిమానులు అనుకున్న దానికంటే ముడింతలు ఎక్కువ రావడంతో హోటల్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ కావడంతో పోలీసులు, అభిమానుల మధ్య గొడవ రావడంతో వీరిని కంట్రోల్ చేయలేక సిబ్బంది చేతులు ఎత్తడంతో దేవర సినిమా ఫ్రీ రిలీజ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

అలాంటి సమయంలో ఎన్టీఆర్ ఒక వీడియోను కూడా విడుదల చేస్తూ స్పందించడంతో కాస్త ప్రశాంతంగా ఉన్నారు.. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తన మొదటి సినిమా కావడం చేత అలాగే ఎన్టీఆర్ మీద ప్రేమతో ఒక వీడియోని విడుదల చేసింది. అయితే ఇందులో ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడుతున్నట్లు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.. జాన్వీ మాట్లాడుతూ తనని ఇంతగా స్వాగతించిన అభిమానులందరికీ నమస్కారం.. తెలుగు ప్రేక్షకులు తనని ఎక్కడ చూసినా జాను పాపా అని పిలుస్తూ ఉన్నారు ఎన్టీఆర్ సార్ అభిమానులు అయితే మరి ముఖ్యంగా ధన్యవాదాలు.. ఎందుకంటే మీరు నన్ను ఒక సొంత మనిషిలా ఫీలవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు.. మీరు కూడా మా అమ్మకి అంతే ఇష్టం.. అలాగే తనకి కూడా ఇష్టం అంటూ తెలియజేస్తూ ఇంతలా సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ సార్ కి ఎన్టీఆర్ అభిమానులకు, తన తల్లి అభిమానులకు, నా అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో తనని సెలెక్ట్ చేసుకోవడం ఎన్టీఆర్ గారు నా అదృష్టం అంటూ తెలియజేసింది. తన మొదటి ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను అంటూ తెలియజేసింది జాన్వీ కపూర్..

అయితే ఈమె ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాలని జాన్వీ తెలుగు నేర్చుకొని మరి ప్రయత్నించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం చేత ఇలా వీడియో రూపంలో కొన్ని విషయాలను తెలిపింది. జాన్వీ ఇలా వీడియో తెలుగులో నేర్చుకోవడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అంటూ ఆయన మీద ప్రేమ వల్లే ఇలా తెలుగులో మాట్లాడాలనుకుందట. కానీ ప్రీ రిలీజ్ క్యాన్సిల్ కావడం చేత అభిమానులకు నిరాశే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: