ఎన్టీఆర్ కు ఈవెంట్స్ కలిసి రావడం లేదా..?తలనొప్పిగా మారిన ఫ్యాన్స్ అత్యుత్సాహం..!!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాల నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో అదరగొట్టాడు.విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు మనవడిగా ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..ఆది సినిమాతో నట విశ్వ రూపం చూపించిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో ఊహించని మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు.. ఆ తరువాత ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సింహాద్రి.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తిరుగులేని విజయం సాధించింది.. అప్పటి వరకు వున్న రికార్డ్స్ చెరిపేసింది. కేవలం 19 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఆ మాస్ ఎఫెక్ట్ తరువాత సినిమాలపై గట్టిగానే పడింది.. ఎన్టీఆర్ సింహాద్రి తరువాత నటించిన సినిమా ఆంధ్రావాలా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమా తెరకెక్కించారు.. తనదైన మాస్ డైలాగ్స్ తో పంచులతో పూరీ ఈ సినిమాను తెరకెక్కించారు.. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఊహకందని అంచనాలే ఈ సినిమా ఘోర పరాజయానికి కారణం.. ఎన్టీఆర్ కు సింహాద్రి సినిమాతో భరించలేని క్రేజ్ వచ్చింది. దీనితో ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఆడియో రిలీజ్ ఎంతో భారీగా ప్లాన్ చేసారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 లక్షలకు పైగా అభిమానులు ఆడియో వేదిక అయిన నిమ్మకూరుకు చేరుకున్నారు.అభిమానుల కోసం స్పెషల్ గా మూడు ట్రైన్స్ వేయడం జరిగింది.. అయితే ఆ ఆడియో ఫంక్షన్ పూర్తిగా జరగలేదు.. 

నిమ్మకూరులో ఎక్కడ చూసిన అభిమానులు.. ఆ అభిమాన తాకిడికి యాంకర్ సుమ భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. అభిమానుల సునామి ముందు ఇంక ఆడియో లాంచ్ కొద్ది సమయానికే ముగిసింది.. ఎన్టీఆర్ స్పెషల్ హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నారు.అలాంటి ఆడియో లాంచ్ ఇంతవరకు ఏ హీరోకు జరిగి ఉండదు.. ఇక ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన బాద్షా ఆడియో లాంచ్ లో కూడా విపరీతంగా అభిమానులు రావడంతో తొక్కిసలాటలో ఒక అభిమాని చనిపోయాడు.. దీనితో నిర్మాత బండ్లగణేష్ బహిరంగంగా క్షమాపణ చెప్పాడు.. ఎన్టీఆర్ చనిపోయిన అభిమాని కుటుంబాన్ని ఆడుకుంటానని హామీ ఇచ్చారు. మళ్ళీ ఇన్నేళ్లకు అలాంటి ఘటనే జరిగింది.. ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనితో సెప్టెంబర్ 22 ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవోటల్ లో ప్లాన్ చేసారు..అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియా ఉప్పెనలా వస్తున్న ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది. 6000 మంది కెపాసిటి వున్న నోవోటల్ కు అభిమానులు 25000 మందికి పైగా వచ్చేందుకు ప్రయత్నం చేసారు.. దీనితో పరిస్థితి చేజారుతుందేమో అనే భయంతో ఈవెంట్ ను రద్దు చేసారు.. దీనితో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో అక్కడ అద్దాలు పగలగొట్టి శ్రేయాస్ మీడియాపై తిట్ల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కూడా ఈవెంట్ కాన్సల్ అయినందుకు భాధపడుతూ ఎవరూ అధైర్యపడొద్దని ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: