బిగ్ బాస్ 8 మొదలై మూడు వారాలు పూర్తయింది.ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.14 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వడంతో 11 మంది సభ్యులే ఉన్నారు. ఇక ఈ షోలో కాస్త నెగెటివిటీ తో పాటు కాస్త లవ్ స్టోరీ ని నడిపిస్తున్న ఆకుల సోనియా పైన అందరి దృష్టి ఉంది. ఓవైపు నిఖిల్ తో వ్యవహారం నడిపిస్తూనే మరోవైపు నాకు అన్న అవుతాడు పెద్దోడు చిన్నోడు అంటూ మాటలు మాట్లాడుతోంది. దీంతో ఆకుల సోనియా పై చాలా మంది ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈమె ఆటతో పాటు క్యారెక్టర్ మీద కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. కొంతమంది లేడీ కంటెస్టెంట్ల మీద ఈమె చేసే కామెంట్లు చాలామందికి నచ్చడం లేదు.అయితే అలాంటి బిగ్ బాస్ సోనియా గురించి తాజాగా యూట్యూబ్ లో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. బిగ్ బాస్ సోనియాకి పెళ్లయిపోయిందట.. విచిత్రం ఏంటంటే విడాకులు కూడా అయ్యాయట..
ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణలోని కరీంనగర్ కి చెందిన ఆకుల సోనియా వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈమె బీటెక్ చేయడానికి హైదరాబాద్ కి వచ్చిన సమయంలో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలా సినిమాల్లోకి రావాలి అనుకొని ఎన్నో కలలు కన్నదట.కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సినిమాలు వద్దు మోడలింగ్ వద్దు అని ఓ అబ్బాయి తో పెళ్లి చేశారట. ఇక ఆ అబ్బాయితో హైదరాబాద్ లోనే ఉంటూ వైవాహిక జీవితంలో కొనసాగుతూనే మరోవైపు భర్తను ఒప్పించి యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట. అలా యాంకర్ గా కొన్ని షోలు చేస్తున్న సమయంలో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లోకి వెళ్దామని నిర్ణయం తీసుకుందట.
కానీ సోనియా చేసే పనులు పెళ్లి చేసుకున్న భర్తకి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అలా రోజురోజుకు గొడవలు ఎక్కువవ్వడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారట. ఇక విడాకులు అయ్యాక సోనియా సినిమాల్లో కొనసాగింది. అలా కొద్దిరోజులు సినిమాల్లో చేసి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ లోకి వెళ్లింది. ఇక మరో విషయం ఏమిటంటే..ఆకుల సోనియాకి మళ్ళీ పెళ్లి ఫిక్స్ అయిందట. ఎన్నారై తో పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.అలాగే హౌస్ లోకి కూడా అత్తమామలు అలాగే కాబోయే భర్త సహకారంతోనే వచ్చినట్టు ఈ మధ్యనే సోనియా తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు