దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక గల కారణాలు ఏమిటి?

Suma Kallamadi
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఫీవర్ నడుస్తున్న తరుణంలో తాజాగా జరిగిన ఘటన, ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. అభిమాన నటుడ్ని చూడాలని, వీలైతే అతడితో ఫోటో దిగాలని ఆశలు పెట్టుకొని దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన అభిమానులకి అనుకోని విధంగా చేదు అనుభవం ఏర్పడింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవును, అభిమానుల విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా అగ్ర హీరోలుగా చెలామణీ అయ్యే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళవలనే ఓపెనింగ్స్ వచ్చేది మరి!
ఈ క్రమంలోనే తాజా పరిణామానికి ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, అభిమానులను బుజ్జగించడానికి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమాపైన అంచనాలు భారీగా పెట్టుకున్నారు. పైగా ఎన్టీఆర్ నుండి సోలో సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయింది. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నోవాటెల్ లో నిర్వహించగా లిమిటెడ్ గా పాస్ లు జారీ చేశారు. అయినప్పటికీ అభిమానుల తీరుని తెలంగాణ గవర్నెమెంట్ ముందే ఉహించాల్సి ఉండాలి. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాల్సింది. అరకిలోమీటర్ ముందే పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించే పని ముందుగా చేస్తే, వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు!
అలా కాకుండా ప్రతి ఒక్కరు వేదిక గేటు వద్దకు వచ్చే అవకాశం ఇస్తే.. జనాలు పెరిగే కొద్దీ.. హైదరాబాద్ లాంటి సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్న లాజిక్ ను ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వాహకులు ఎలా మిస్ అయ్యారు అనేది ప్రశ్నగా ఉంది. వేలాది మంది అభిమానుల్ని యాబై మంది పోలీసులు.. ఏ మాత్రం కంట్రోల్ చేయగలరు? కట్ చేస్తే, భారీగా వచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేసే క్రమంలో ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు లోపలకు దూసుకెళ్లారు. అక్కడ వారికి ఇబ్బంది ఎదురు కావటంతో సీన్ మొత్తం రచ్చ రచ్చగా మారింది. దాంతో ప్రవేశ ద్వారాల అద్దాలు పగిలిపోవటం.. వంటివి జరిగాయి. దాంతో అనూహ్య పరిణామాలతో ఫంక్షన్ మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంకేముంది ఎన్నో వ్యయ ప్రయాసలతో వచ్చిన వారంతా తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: