NBK 109 : ఈ నిర్ణయాలు ఏంటి.. ఈ డిలే ఎందుకు..?

Pulgam Srinivas
బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు ప్రోమో వీడియోలను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నుండి రెండు ప్రోమో వీడియోలను విడుదల చేసిన ఇప్పటివరకు ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 109 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా యొక్క షూటింగ్ను మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ మూవీ యొక్క విడుదల తేదీని కూడా ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సినిమా దసరా కు వస్తుంది అని ఒక సారి , క్రిస్మస్ కి వస్తుంది అని ఒక సారి , సంక్రాంతి పండుగకు వస్తుంది అని ఒక సారి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ మూవీ బృందం మాత్రం దేనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగకు అనేక సినిమాలు లిస్టు లోకి వచ్చేసాయి. చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమా , నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ , సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న మజాకా , వీటితో పాటు తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఇన్ని సినిమాలు సంక్రాంతి కి రాబోతున్నాయి.

నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ మూవీ కి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ మిగతా అన్ని సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చేసాయి. మరి బాలయ్య సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం రావడం లేదు. దానితో ఈయన అభిమానులు ఇంతా డిలే ఎందుకు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: