షాక్: వారందరికీ వార్నింగ్ ఇస్తున్న డైరెక్టర్ శంకర్.. అసలు కథ ఏమిటంటే..?
ఇటీవల ఇండియన్-2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళ నవల పేరుపొందిన నవ యుగ నాయగన్ వెల్ వాటిని డైరెక్టర్ శంకర్ తీసుకురావాలని ప్రయత్నించారట. ఇటీవల చిత్ర నిర్మాతలు కూడా కొన్ని నవల సన్నివేశాలను అనధికారికంగా ఉపయోగించడం పై కూడా డైరెక్టర్ శంకర్ కూడా చాలా అసంతృప్తిని తెలియజేశారు.. ఒక కాపీ రైట్ హోల్డర్ తన అనుమతి లేకుండా..వాటి ఆలోచనలను స్వీకరించే వారి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ డైరెక్టర్ శంకర్ ట్విట్టర్ నుంచి తెలిపారు..
వెంకటేశన్ ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయక వేల్ పారి వంటి వాటిలో ఉన్న అంశాలను ఎన్నో చిత్రాలలో అనుమతి లేకుండానే సన్నివేశాలను దొంగలించి మార్చి చూపించడం జరుగుతోందని ఇటీవల విడుదలైన ఒక సినిమా ట్రైలర్ లో కూడా ఇలాంటి సన్నివేశాలు చూశాను.. ఇది నిజంగానే చాలా తన మనసును బాధ కలిగించిందని దయచేసి ఇకమీదట ఎవరైనా సరే నవలలోని సన్నివేశాలను చిత్రాలలో ,వెబ్ సిరీస్లలో ఎక్కడైనా ఉపయోగించుకోవడం మానుకోండి అంటూ తెలియజేశారు శంకర్.
డైరెక్టర్ శంకర్ లాక్డౌన్ సమయంలో తాను ఈ నవల చదివి ఇష్టపడి వీటి యొక్క హక్కులను కొన్నానని.. అలా తాను కూడా ఎన్నో సినిమాలకి స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించారని తెలిపారు.. ఇండియన్-2 సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మిగిలినప్పటికీ ఇండియన్-3 సినిమాని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారట డైరెక్టర్ శంకర్.