బన్నీ కథతో దేవర.. బన్నీ వాసు ఆన్సర్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది..?

MADDIBOINA AJAY KUMAR
అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ మూవీ అనౌన్స్ కాగానే మూవీ యూనిట్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్లో అల్లు అర్జున్ చేతిలో ఓ కత్తి పట్టుకుని సముద్రం మధ్యలో నిలబడి ఉంటాడు. ఇక ఆ పోస్టర్ విడుదల అయిన తర్వాత ఇదేదో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయ్యి ఉంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి వీరిద్దరి కాంబోలో మూవీ క్యాన్సిల్ అయింది. ఇకపోతే కొరటాల శివ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని తెరకెక్కించాడు.

ఈ మూవీ కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగబోతుంది. దానితో చాలా మంది దేవర మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుండే అల్లు అర్జున్ తో కొరటాల ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. ఆది క్యాన్సిల్ అయింది. దానితో అదే కథతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల సినిమాను రూపొందిస్తున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతూ వస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ కు నిర్మాత బన్నీ వాసు అత్యంత ఆప్తుడు , స్నేహితుడు అనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయనకు అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొంతకాలం క్రితం ఓ సినిమా అనౌన్స్ అయింది. ఆ సినిమా పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం కొరటాల "దేవర" అనే సినిమాను ఎన్టీఆర్ తో రూపొందించాడు. ఆ కథ ఈ కథ ఒకటేనా అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ... ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను వేరే పనులతో బిజీగా ఉన్నాను. ఆ సినిమా కథ గురించి నాకు పెద్దగా తెలియదు. కూడా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అని ఆయన సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: