బాలనటిగా ఎన్నో సినిమాల్లో అలరించిన శ్రీ దివ్య అందరికీ తెలిసే ఉంటుంది.మనసారా..’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ తరవాత ‘బస్‌స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో శ్రీదివ్య తమిళ చిత్రసీమ వైపు మళ్లింది. తొలి చిత్రంతోనే సైమా అవార్డు దక్కించుకుంది. ఇక అక్కడి నుంచి వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతోంది. ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో పరభాషా హీరోయిన్ల హవా కొనసాగుతోంది. ముంబై నుంచి వచ్చి అంద చందాలను ఆరబోసే హీరోయిన్లకే మన దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగమ్మాయిల టాలెంట్‌ను టాలీవుడ్ గుర్తించడంలేదని గత కొంతకాలంగా వినిపిస్తున్న విమర్శ. కానీ తమిళ ఇండస్ట్రీ అలా కాదు. అక్కడ లోకల్ బ్యూటీలకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే మన రాజోలు అమ్మాయి అంజలి తెలుగు కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇప్పుడు శ్రీదివ్య కూడా అదే కోవకు చెందుతుంది. తమిళం లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న శ్రీ దివ్య.. ‘కాక్కీ సట్టై’, ‘జీవా’, ‘ఈటీ’, ‘మరుదు’, ‘బెంగుళూర్ నాట్కల్’, ‘పెన్సిల్’ సినిమాల్లో నటించి మెప్పించింది.అయితే శ్రీదివ్య మాత్రమే కాదు ఆమె అక్క కూడా హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా.? అవును ఆమె కూడా ఓ క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు శ్రీ రమ్య. ఈ అమ్మడు కూడా చాలా అందంగా ఉంటుంది. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాతో నంది అవార్డు సైతం గెలుచుకుంది.1940 లో ఒక గ్రామం సినిమా డ్రామ ఎంటర్టైనర్ చిత్రం బాలాదిత్య, శ్రీ రమ్య,ముక్కు రాజ, రామకృష్ణ, రజిత, గుండు హనుమంత రావు, రాళ్ళపల్లి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నరసింహ నంది నిర్వహించారు మరియు నిర్మాతలు నందిరెడ్డి నరసింహ రెడ్డి, బెల్లంకోండ సురేష్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాకేత్ సాయిరాం స్వరాలు సమకుర్చారు. ఆతర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేసింది శ్రీ రమ్య.