వావ్: లేడీ అభిమానికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. వీడియో వైరల్..!

Divya
నందమూరి బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలలో మరొక వైపు సినిమాలలో కూడా భారీగానే క్రేజ్ ఉన్నది. ఈ మధ్యకాలంలో తరచు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు బాలయ్య. గతంలో బాలయ్య కోపిష్టి అనే పేరు కూడా వినిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయి అభిమానులతో సెల్ఫీ దిగడం , సినిమా ఈవెంట్లకు గెస్ట్లుగా రావడం, యంగ్ హీరోయిన్లను హీరోలను ప్రోత్సహించడం వంటివి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈమధ్య అభిమానులకు కోసం సడన్ సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు .

ఇప్పుడు తాజాగా మరొక అభిమాని కోసం సింప్లిసిటీని చాటుకొని ఏకంగా మూడు గంటల పాటు ఒక లేడీ అభిమాని ఇంట్లో తన కుటుంబ సభ్యులతో పిల్లలతో సైతం ముచ్చటించినట్లుగా ఆమె తెలియజేస్తోంది. అందుకు సంబంధించి వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతోంది. హిందూపురం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తమ ఇంటికి ఆహ్వానిస్తే వస్తారో అనే అనుకున్నాము కానీ బాలయ్య మాత్రం కాస్త సమయం తీసుకొని మరి ఇంటికి రావడం మమ్మల్ని ఆనందానికి గురి చేసింది.. సుమారుగా మా కుటుంబ సభ్యులతో మూడు గంటల పాటు ఉండడమే కాకుండా గృహప్రవేశం కార్యక్రమంలో కూడా సందడి చేశారంటూ తెలిపారు బాలయ్య.

ఇంత గొప్ప నటుడు తమ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆ అభిమాని కూడా ఈ వీడియోలో చెప్పుకొస్తున్నది. ఇలాంటి వ్యక్తిని తమ జీవితంలో కూడా చూడలేదని బాలయ్య డౌన్ టు ఎర్త్ అంటూ ఆమె ప్రశంసలు సైతం కురిపించింది. బాలయ్య గృహప్రవేశంలో పాల్గొన్నటువంటి దంపతులను సైతం ఆశీర్వదిస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. అలాగే బాలయ్య వారందరితో కలిసి కూడా భోజనాలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడికి వచ్చిన అభిమానులతో కూడా సెల్ఫీలు దిగి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానుల సైతం బాలయ్య మరొకసారి అభిమానికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి ఆనందానికి అవధులు లేకుండా చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: