కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియా సినీ ప్రేమికులు ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ ను వీక్షించేవారు కాదు. ఎక్కువ శాతం థియేటర్ మరియు బుల్లి తెరపై వంచె కంటెంట్ ను చూసేవారు. ఇక కరోనా ఎప్పుడు అయితే వచ్చిందో అప్పటి నుండి ఇండియాలో ఓ టీ టీ కంటెంట్ ను చూసే జనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లలో కాకుండా ఓ టి టి లోనే విడుదల కావడంతో ఓ టీ టీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక కొన్ని సినిమాలకు ఓ టి టి బిజినెస్ ద్వారానే వందల కోట్లలో డబ్బులు వస్తున్నాయి.
దానితో మూవీ నిర్మాతలకు ఇది అదనంగా డబ్బును చేకూర్చే పద్ధతుల మారిపోయింది. ఇక కొన్ని సినిమాలు విడుదల అయిన తర్వాత నెల తిరగకుండానే ఓ టి టి లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయ్యి సంవత్సరాలు గడుస్తున్న ఓ టీ టీ లోకి రావడం లేదు. అలాంటి సినిమాలు కూడా కొన్ని స్టార్ హీరోలవి ఉన్నాయి. కొంత కాలం క్రితం టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ "ఏజెంట్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం కంటే ఎక్కువ అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ ఓ టి టి లోకి రాలేదు. శివ కార్తికేయన్ ఈ సంవత్సరం ఆయాలాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ మాత్రం ఇప్పటి వరకు ఓ టీ టీ లో అందుబాటులోకి రాలేదు. మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న ఓ టీ టీ లోకి రాని సందర్భాలు ఉన్నాయి.