ఆ ఫ్లాప్ మూవీ అంటే బాలయ్య భార్యకు ఎంతో ఇష్టమట.. ఎందుకో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు . ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్త లోనే అనేక విజయాలను అందుకొని చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు . ఇక ఇప్పటికి కూడా వరుస విజయాలను అందుకుంటు తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . బాలకృష్ణ భార్య అయినటువంటి వసుంధర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటే ఆమె మాత్రం తన పిల్లల బాగోగులు చూస్తూ ఆయనకు ఎంతో సపోర్టుగా ఉంది.

ఆయన సపోర్ట్ తోనే బాలయ్య ఇంతగా ఎదిగాడు అని కూడా బాలయ్య స్నేహితులు , సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక బాలయ్య చాలా సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్న బాలకృష్ణ నటించిన సినిమాలలో వసుంధర కు ఓ ప్లాప్ మూవీ అంటే చాలా ఇష్టం అట. ఆ మూవీ ఏమిటి అనుకుంటున్నారా ..? అదే చెన్నకేశవ రెడ్డి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించాడు.

ఇక తండ్రి పాత్రలో నటించిన బాలయ్య కు జోడిగా టబు నటించగా , కొడుకు పాత్రలో నటించిన బాలయ్య కు శ్రేయ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం రీ రిలీస్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా అంటే బాలయ్య భార్యకు ఎంతో ఇష్టం అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: