దేవర యూనిట్ చేసిన మిస్టేక్ పాన్ ఇండియా మూవీలకు గుణపాఠంలో మారనుందా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో సెప్టెంబర్ 22 వ తేదీన ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద గ్రౌండ్లను ఎంపిక చేసుకున్న అందుకు పర్మిషన్లు దొరకకపోవడంతో తక్కువ కెపాసిటీ కలిగిన నోవేటెల్ హోటల్ ను ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంచుకున్నారు. ఈ హోటల్ కెపాసిటీ చాలా తక్కువ కావడం కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ మొత్తంలో జనాలు ఒక్క సారిగా హోటల్ దగ్గరికి రావడంతో హోటల్ బృందం , ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా సంస్థ చేతులెత్తేసింది. ఇక పోలీసులు కూడా ఏమీ చేయలేక పోయారు. దానితో మూవీ బృందం ఇంత మందిని హ్యాండిల్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సల్ చేసింది. ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ తో చాలా మంది స్టార్ హీరోలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

అవేమిటి అంటే ..  స్టార్ హీరోల సినిమాలు అంటే జనాలు భారీ మొత్తంలో వారి ఈవెంట్ లకి వస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమా ఈవెంట్లకు తక్కువ స్థాయి కెపాసిటీ ఉన్న హాల్స్ అస్సలు సరిపోవు. వారు కచ్చితంగా పెద్ద స్థాయి ఉన్న ఓపెన్ గ్రౌండ్స్ లో ఈవెంట్లు పెట్టుకుంటేనే చాలా మంచిది. లేదంటే దేవర సినిమాకు ఎదురైన పరిస్థితులే వారికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక దేవర మూవీ కి జరిగిన సంఘటనన చాలా మంది స్టార్ హీరోలకు ఒక గుణపాఠంలో మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: