ఇక మహేష్ ఇంటి సీక్రెట్స్ అన్ని లీకైనట్టేనా.. హ్యాపీ కాదు ఫ్యాన్స్ ఆందోళన?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. మహేష్ బాబు ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాదు మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్. ఒకప్పుడు హీరోయిన్గా నటించి ఇప్పుడు ఫ్యామిలీ ఉమెన్ గా కుటుంబం చూసుకుంటున్న నమ్రత  శిరోద్కర్, ఇక మహేష్ గారాల పట్టి సితార పాపా, మహేష్ వారసుడు అభిమానుల ఫ్యూచర్ సూపర్ స్టార్ గౌతమ్ గురించి కూడా తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.

 అయితే ఫ్యామిలీ విషయాలను ఎంతో సీక్రెట్ గా ఉంచుకోవడానికి మహేష్ బాబు ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ గా ఎన్ని విషయాలు చెప్పినా పర్సనల్ విషయాలలో మాత్రం ఎక్కడ ఓపెన్ అవ్వరు. కానీ ఇప్పుడు అలాంటి మహేష్ బాబు ఇంటి సీక్రెట్స్ అన్ని బయటపడబోతున్నాయి అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అంతే దీనికి కారణం కూడా లేకపోలేదు. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లబోతుంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ కూడా గతం వర్తమానం భవిష్యత్తు అంటూ అన్ని విషయాలపై మాట్లాడుకుంటారు  ఇప్పుడు ఈ సీజన్ కూడా ఇలాంటి తీమ్ ప్రారంభం కాబోతున్న అని తెలుస్తుంది.

 దీంతో హిందీ బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్తున్నా నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప ఇక ఘట్టమనేని ఫ్యామిలీ గురించి ఎలాంటి విషయాలను బయటపెట్టబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అభిమానులకు తెలియని ఎలాంటి సీక్రెట్స్ ని శిల్ప బిగ్ బాస్ హౌస్లో రివీల్ చేస్తుందో చూడాలని అటు అభిమానులకు కూడా ఎదురుచూస్తున్నారు. కాగా మహేష్ కుటుంబంలో చాలా వెకేషన్లలో సందడి చేస్తూ ఉంటుంది శిల్ప. ప్రతి ఈవెంట్ లోను కనిపిస్తూ ఉంటుంది. ఇక నమ్రత ప్రతి వ్యాపకంలో కూడా శిల్ప సహకారం ఉంటుందట. ఇలా మహేష్ ఫ్యామిలీతో ఎంతో దగ్గర సంబంధం కలిగిన శిల్ప.. ఘట్టమనేని ఫ్యామిలీ గురించి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు అనే విషయం గురించి చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: