'దేవర'కు సూపర్ బజ్.. అయినా తారక్ ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్?

praveen
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో నిరీక్షణగా ఎదురుచూస్తున్న దేవర మూవీ ఈనెల 27వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. అయితే ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ లో చిత్ర బృందం  బిజీ బిజీగానే ఉంది.

 ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా కూడా దేవర మూవీ గురించి చర్చ జరుగుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుంది. కొరటాల ఈ సినిమా విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఇలా ఏదో ఒక అంశం గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నిరాశలో మునిగిపోయే ఒక ఘటన జరిగింది. ఏకంగా దేవర ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది అనుకుంటే చివరికి ఆ ఈవెంట్ రద్దు అయింది అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఫాన్స్ ఎంత నిరాశ చెందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అందరినీ కూడా మరో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. అదే దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయడమే. గతంలో ఎన్టీఆర్ నటించిన ఒక ఫ్లాప్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా సినిమా టైంలో కూడా ఇలా ఈవెంట్ ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆ సినిమా టైంలో నిమ్మకూరులో ఆడియో ఈవెంట్ ఏర్పాటు చేశారు. తారక్ హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళాడు. అయితే ఈవెంట్ కి 10 లక్షల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు.

 వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా ఆరు రైళ్లల్లో ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. దీంతో ఏరియా మొత్తం కిక్కిరిసి పోయింది. కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ కూడా అయింది. స్టేడియం కెపాసిటీ కేవలం 20,000 మాత్రమే. కానీ వచ్చింది 10 లక్షలు మంది. స్టేడియం సరిపోలేదు దీంతో రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. స్టేజ్ పైకి కూడా అభిమానులు వచ్చి రచ్చ చేయడం మొదలు పెట్టారు. ఇక అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ కేవలం రెండే రెండు ముక్కలు మాట్లాడి ఈవెంట్ ని ముగించేశారు. కేవలం అరగంటలోనే ఈవెంట్ అయిపోయింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు ఈ నేల తర్వాత మళ్లీ తారక్ దేవర సినిమా ఈవెంట్ రద్దయింది. దీంతో గతంలో లాగానే ఇక ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందా ఏంటి అని అభిమానులు భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: