' దేవ‌ర ' భారీ రిస్క్‌... ఈ బిగ్ టాస్క్ లో స‌క్సెస్ అవుతాడా ఎన్టీఆర్‌... ?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరో మూడు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. వాస్తవంగా సోలోగా చెప్పాలి అంటే 2018 చివర్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఐదున్నర సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ సింగల్ గా తెరమీద కనిపిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ ను తెరమీద చూస్తామా ? ఎన్టీఆర్ డ్యాన్స్ ... ఎన్టీఆర్ డైలాగులు ... ఎన్టీఆర్ ఫైట్లు ఎలా ఉంటాయో ? అని ఒక్కటే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పంపిణీ చేస్తున్నారు. హోల్సేల్గా దేవర హక్కులు మొత్తం ఆయన తీసుకున్నారు.

నైజాం ఏరియాకు రు. 42 కోట్లకు పైగా పంపిణీ హక్కులు అమ్మారు. ఇది చిన్న టాస్క్ కాదు.. చాలా పెద్ద రిస్క్. సినిమాకు అస్సలు డివైడె టాకు రాకూడదు. బ్లాక్ బస్టర్ అయితేనే ఆ రేంజ్ లో వస్తాయి. బన్నీ త్రివిక్రమ్ అలవైకుంఠపురం లో సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాకు నైజాం లో రు. 42 కోట్ల షేర్ వచ్చింది. అయితే నైజంలో తొలిరోజు మాత్రమే టికెట్ పై వంద రూపాయల అదనపు రేటుకు విక్రయించేలా జీవో వచ్చింది. రెండో రోజు నుంచి కేవలం 25 - 50 రూపాయల లెక్కల అదనపు రేటు పెంచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో అయితే ఈ పెంపు చాలా ఎక్కువగా ఉంది. మరి నైజాంలో ఇలా ఎందుకు చేశారు .. రు. 42 కోట్ల షేర్ రాబట్టడం అనేది పెద్ద రిస్క్ కదా.. ఈ విషయం నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు తెలియదా .. నైజాంలో వీరి స్ట్రాటజీ ఏంటి ? ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఎవరికి అంతుపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: