బిగ్ బాస్ ని తిట్టడానికి కారణం అదే.. బయటకొచ్చాక నిజం బయటపెట్టిన అభయ్?

praveen

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బుల్లితెరపైన మిగతా షోస్ కంటే కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని టాక్. కాగా ఈ షో విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుంది. ఇక మూడో వారంలో సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన సంగతి విదితమే. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన క్రమంలో హోస్ట్ నాగార్జన ఈ కుర్రాడిపై ఫైరయ్యారని మీకు తెలిసే ఉంటుంది. రెడ్ కార్డ్ చూపించి మరీ నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి అవతలికి పో అన్నారు. దీంతో శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన ఆదివారం మాత్రం ఎలిమినేషన్ అయిపోయాడు.
ఓటింగ్ తక్కువగా ఉండడంతోనే అభయ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. ఎనిమిదో సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి 3వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా 3 వారాలకే ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. కానీ అతను ఏ మాత్రం ఎఫెక్టివ్ గా గేమ్ ఆడలేకపోయాడు. ముఖ్యంగా గొప్పలకు పోయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. మరోవైపు బిగ్ బాస్‌ని నానా బూతులు తిట్టడంతో తన గొయ్యి తానే తీసుకున్నట్టు అయింది. కట్ చేస్తే... 3 వారాలకే తట్టా బుట్టా సర్ధుకొని బయటకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది మన సిద్దిపేట కుర్రాడికి!
ఇకపొతే బయటకి వచ్చిన అభయ్ బిగ్ బాస్ ని ఎందుకు తిట్టాడు అనే అంశంపైన మాట్లాడడం జరిగింది. "బిగ్ బాస్ హౌస్ లో రేపటి పుడ్ ఈ రోజే వండుకునే వాళ్లం. ఈ క్రమంలో ఓరోజు ఒక్కసారిగా పది మందికి నేనే వంట చేయాల్సి వచ్చింది. అప్పటికి నేను చాలా టైడ్ గా ఉన్నాను. పైగా పాచిన పుడ్ తినలేక ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం నాతో చెప్పి చాలా బాధ పడ్డాడు. అది నాకు తోటి కంటెస్టెంట్ గా చాలా బాధేసింది. పుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా! అందుకే బిగ్ బాస్ మీద రియాక్ట్ కావాల్సి వచ్చింది. దెబ్బ తగిలిన తరువాత ఆయింట్మెంట్ పెట్టుకోవడం కంటే.. అస్సలు దెబ్బ తగలకుండా చూసుకోవడమే మంచిది... అనేది నా పాలసీ!" అంటూ బిగ్ బాస్ పైన సెటైరికల్ పంచ్ వేశారు అభయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: