కమల్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరు బ్లాక్ బస్టర్.. అది ఇప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్..?

Pulgam Srinivas
సినిమా పరిశ్రమలో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొకరు సినిమా చేయడం చాలా సర్వదారణంగా జరుగుతూ ఉంటుంది . అలా కొంత మంది నటులు రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి . కొన్ని సంవత్సరాల క్రితం లోక నాయకుడు కమల్ హాసన్ దగ్గరికి ఓ సినిమా కథ వెళ్లగా ఆయన దానిని రిజెక్ట్ చేశాడు . ఇక ఆ తర్వాత ఆ కథ చిరంజీవి దగ్గరకు వెళ్లగా ఆయన దానిని ఓకే చేశాడు . దానితో చిరంజీవి కి అద్భుతమైన విజయం దక్కింది. ఆ సినిమా ఏది ..? కమల్ హాసన్ ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ రాజా దర్శకత్వంలో తమిళంలో సత్యరాజు హీరోగా కవితోరా కవితైగల్ అనే సినిమా వచ్చింది. అది తమిళ్ లో సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాను తెలుగు లో కమల్ హాసన్ పెట్టి తీయాలి అని భారతీయ రాజా అనుకున్నాడట. అందులో భాగంగా అతనికి కథను కూడా వివరించాడట. కానీ ఆ కథ కమల్ హాసన్ కు పెద్దగా నచ్చలేదట. దానితో ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత భారతి రాజా ఈ సినిమాను తెలుగులో చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట.

అందులో భాగంగా ఆయనకు కథను వివరించాడట. ఇక చిరంజీవి కి ఆ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాకు ఓకే చేశాడట. ఆ సినిమా ఆరాధన అనే టైటిల్ తో రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటికి కూడా చిరంజీవి కెరియర్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. అలా కమల్ రిజక్ట్ చేసిన సినిమాతో చిరంజీవి మంచి విషయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: