దివంగత నటి సౌందర్య చనిపోయినా కూడా ఆమెపై వచ్చే వార్తలు ఆగట్లేదు. ఆమె గురించి కొన్ని నెగటివ్ వార్తలు వస్తే మరి కొన్ని పాజిటివ్ వార్తలు వస్తూ ఉంటాయి. అయితే గతంలో అంటే సౌందర్య చనిపోక ముందు జగపతిబాబు, వెంకటేష్ వంటి హీరోలతో డేటింగ్ చేసిందనే వార్తలు వినిపించాయి. అలాగే సౌందర్య చనిపోయిన సమయంలో వెంకటేష్, జగపతిబాబులు ఎంతగానో బాధపడ్డారని ముఖ్యంగా వెంకటేష్ తో సౌందర్య పెళ్లి వరకు కూడా వెళ్లిందనే టాక్ కూడా వినిపించింది. అయితే జగపతిబాబు, వెంకటేష్ మాత్రమే కాదు మరో హీరోతో కూడా సౌందర్య కు ఎఫైర్ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మరి ఆ హీరో ఎవరు అనేది చూస్తే..సౌందర్య కి వెంకటేష్,జగపతి బాబే కాకుండా జెడి చక్రవర్తి కూడా ప్రపోజ్ చేసినట్టు ఆ మధ్యకాలంలో రూమర్స్ వినిపించాయి.
ఇక జె.డి చక్రవర్తి, సౌందర్య కాంబోలో ప్రేమకు వేళాయరా,ప్రేమకు స్వాగతం వంటి సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రేమకు వేళాయరా సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య పై ప్రేమ పెంచుకున్న జెడి చక్రవర్తి ఓసారి వెంకటేష్ తో సౌందర్య ఉన్న సమయంలోనే సౌందర్యను ప్రేమిస్తున్నట్టు ప్రపోజ్ చేశారట.అయితే జెడి చక్రవర్తి మాటలకు నవ్వుకున్న సౌందర్య మీ మీద నాకు ప్రేమ ఉంది.కానీ అది మీరు అనుకుంటున్న ప్రేమ కాదు.అది అభిమానం మాత్రమే.
మీ మీద హీరోగా మాత్రమే ప్రేమ ఉంది తప్ప పర్సనల్ గా మీతో నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఇప్పటినుండి ఈ విషయాలు చెప్పడం మీరు మానుకుంటే సరి అంటూ చాలా సున్నితంగా జెడి చక్రవర్తిని రిజెక్ట్ చేసిందట సౌందర్య.ఇక అప్పట్లో సౌందర్య కోసం జెడి చక్రవర్తి చాలా ఇబ్బందులు పడ్డారట.ఆమె దృష్టిలో పడి ఆయన మీద ప్రేమ కలిగేలా చేసుకోవడం కోసం ఎన్నో వేషాలు వేసినప్పటికీ సౌందర్య మాత్రం జెడి చక్రవర్తిని అలా ఎప్పటికీ చూడలేదట. అయితే అప్పటి రూమర్ మళ్ళీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది