చిరుతో ఫైటింగ్‌కే రెడీ అయిన బాల‌య్య‌... నా దారి నాదే అంటూ క్లారిటీ..?

RAMAKRISHNA S.S.
- సంక్రాంతి రేసులో బాల‌య్య 109
- చిరు విశ్వంభ‌ర తో పోటీకి న‌ట‌సింహం రెడీ
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి .. నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి మామూలుగా ఉండ‌దు. అక్క‌డ వార్ హీటెక్కి పోతూ ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా చిరు - బాల‌య్య సినిమాలు సంక్రాంతి రేసులో కి దిగుతున్నాయంటే మామూలు వార్ ఉండ‌దు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఈ పోరు తెలుగు సినీ ప్రేమికుల‌కు కావాల్సినంత మ‌జా ఇస్తూ వ‌స్తోంది. చిరు ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి త‌న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని ఢీ కొట్టారు.

ఆ త‌ర్వాత గతేడాది సంక్రాంతికి చిరు వాల్తేరు వీర‌య్య .. బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాలు పోటీ ప‌డ్డాయి. ఈ రెండు సార్లు కూడా ఇద్ద‌రి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతికి కూడా వీరిద్ద‌రు త‌మ సినిమాల‌తో పోటీ ప‌డ‌బోతున్నారు. చిరు విశ్వంభ‌ర సినిమా సంక్రాంతికి ఖ‌ర్చీఫ్ వేసుకుని ఉంది. డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు బాల‌య్య సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ సినిమా రిలీజ్ కి ఫిక్స్ అంటూ ఒకటి వైరల్ గా మారింది. బాలయ్య 109 ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి దింపనున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ కూడా రానుంది అని తెలుస్తుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం జనవరి 9 అయితే బెటర్ అనే భావనలో ఉన్నారు. ఏదేమైనా మ‌రోసారి సంక్రాంతికి చిరు వ‌ర్సెస్ బాల‌య్య వార్ అదిరిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: