దేవర vs కల్కి : ఎంత దేవర అయినా డార్లింగ్ ముందు దిగదుడుపే..!!

murali krishna
గతంలో సినిమా ఎలా ఉంది అనే టాక్ నడిచేది. కానీ నేడు ఈ లెక్క మారింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. బాక్సాఫీసు వద్ద వసూలు చేసిన కలెక్షన్లు మాత్రమే సినిమా హిట్టా, ఫట్టా అని డిసైడ్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ అయ్యాక తేలిన లెక్కలే సినిమా సక్సెస్సా కాదా అనేది తేలుస్తున్నాయని ట్రేడ్ పండితుల మాట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి, ఓటీటీ, శాటిలైట్ హక్కులు ఎంతకు కొనుగోలు అయ్యాయో ఓ లెక్క అయితే.. తొలి రోజు కలెక్షన్స్, వీకెండ్, ఎండింగ్ వసూళ్లు కీలకంగా మారాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత తారక్ కనిపించి రెండేళ్లు అయిపోయింది. అతడి రాక కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవరతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు ఈ మ్యాన్ ఆఫ్ ది మాస్. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్27న విడుదల కానుంది. అయితే ఇప్పుటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు వినిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 140 కోట్లకు ఉందన్నది న్యూస్. ఏపీ, తెలంగాణలో ఈ మేరకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస జరిగినట్లు తెలస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' టికెట్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్‌కి లైన్ క్లియరైనా సమయంలో  ఫ్యాన్  సరికొత్త చర్చను తెరపైకి తీసుకు వచ్చారు. అదే బుక్ మై షో టికెట్స్ బుకింగ్ అనలిటిక్స్. ఈ సైట్‌లో ప్రభాస్ 'కల్కి 2898 AD' విడుదలకు మూడు రోజుల ముందు 3,30,000 వేల అమ్ముడు పోగా గంటకి 15 వేల 420 టికెట్లు అమ్మడయ్యాయి. అలాగే వన్ మిలియన్ యూజర్స్ ఇంట్రెస్ట్ చూరగొంది. 'దేవర' విషయానికి వస్తే ఒక లక్ష ఆరు వేల టికెట్లు అమ్మితే గంటకి 3 వేల 780 టికెట్ల అమ్మకాలు క్రియేట్ చేస్తోంది. కాగా, దేవరకి 772.3K యూజర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో ప్రభాస్, తారక్ అభిమానుల మధ్య రచ్చ షురూ అయ్యింది. అంతేకాకుండా ప్రభాస్ 'సలార్' మూవీ కూడా రిలీజ్‌కు ముందే 82 వేల టికెట్లు(తెలుగు రాష్ట్రాలు మినహాయించి) సేల్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామా సృష్టిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా బాగుండి అభిమానులు అనవసర రాద్ధాంతాలకు వెళ్లకపోతే మంచిదని మరికొందరు సూచిస్తున్నారు.ఇదిలావుండగా ప్రస్తుతం కొరటాల దేవర సక్సెస్ కోసం సినిమాను స్ట్రాంగా జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: