దేవరకు పోటీగా మరో తమిళ్ సినిమా..?

shami
ఆరేళ్ల తర్వాత బాక్సాఫీస్ పై తన సత్తానికి సోలోగా చూపించేందుకు వస్తున్నాడు ఎన్ టీ ఆర్. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా పార్ట్ 1 శుక్రవారం వస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఐతే దేవర తో పాటు తెలుగు సినిమాలేవి పోటీకి సాహసించలేదు కానీ రెండు తమిళ్ సినిమాలు మాత్రం పోటీకి దిగుతున్నాయి. అందులో ఒకటి కార్తీ సత్యం సుందరం కాగా మరోటి విజయ్ ఆంటోని హిట్లర్.
కార్తి సత్యం సుందరం సినిమా ఎన్ టీ ఆర్ దేవర రిలీజైన నెక్స్ట్ డే వస్తుంది. ఐతే విజయ్ ఆంటోని హిట్లర్ మాత్రం తారక్ దేవర 1 రిలీజ్ నాడే రిలీజ్ ఫిక్స్ చేశారు. తెలుగులో కార్తి సత్యం సుందరం సినిమాకైనా కాస్త ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ దేవరతో పోటీకి దిగుతున్న హిట్లర్ కి మాత్రం అసలు ప్రమోషన్స్ చేయట్లేదు. బిచ్చగాడు సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ మీద నమ్మకం పెట్టుకున్న విజయ్ బిచ్చగాడు 2 తో కూడా సక్సెస్ అందుకున్నాడు.
ఐతే ఈమధ్యలో చాలా సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. హిట్లర్ గా మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు విజయ్ ఆంటోని. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. పొలిటికల్ యాక్షన్ మూవీగా వస్తున్న హిట్లర్ ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించింది. దేవర తో పాటు విజయ్ ఆంటోని హిట్లర్ కూడా వస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. తెలుగులో విజయ్ ఆంటోని సినిమా బిజినెస్ కూడా అంత గొప్పగా ఏమి జరగలేదని టాక్. మరి సినిమా అంత గ్రాండ్ గా రిలీజ్ ఉంటుందా అన్నది కూడా డౌట్ గానే చెప్పొచ్చు. కానీ తమిళ్ లో దేవర సినిమాకు కూడా మంచి హైప్ ఏర్పడింది. అక్కడ స్ట్రైట్ సినిమాలైన వీటి మధ్య తారక్ దేవర ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: